సమాజానికి పట్టుగొమ్మలు కుటుంబాలే

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కుటుంబాలే సమాజానికి పట్టుగొమ్మలు. అలాంటి కుటుంబాల అభివృద్ధికి సారధులు మహిళలే. కుటుంబాన్ని కాపాడుకుంటేనే సమాజం బాగుంటుంది. కానీ పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని మన కుటుంబ విలువలు దిగజారుతున్నాయి. భార్యభర్తల అనుబంధం బలహీనమవుతోంది. తల్లిదండ్రులు అనాథాశ్రమాలపాలవుతున్నారు. ఇంట్లో పెద్దదిక్కులేకుండా పోతోంది. కుటుంబ వ్యవస్థను కాపాడుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారే ముప్పు పొంచి ఉందని గ్రహించి జమాఅతె ఇస్లామీహింద్ మహిళా విభాగం కుటుంబ విలువల ప్రచారోద్యమనికి శ్రీకారం చుట్టింది. కుటుంబ విశిష్టతను తెలియజేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.

జమాఅతె ఇస్లామీహింద్ మహిళలు పలు ప్రాంతాల్లోని కుటుంబాలను కలిసి కుటుంబ ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. కుటుంబ విలువలపై ప్రచురించిన సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మీ ఇంట్లో అమ్మానాన్నలను ఎలా చూసుకుంటున్నారు? మీ భార్యాభర్తల బంధం ఎలా ఉంది? పిల్లల బాగోగులు ఎలా చూసుకుంటున్నారు? బంధువులతో సన్నిహిత సంబంధాలున్నాయా? అనే ప్రశ్నలతో కుటుంబ సంస్కరణకు పాటుపడుతున్నారు. మహదీపట్నం, టోలీచౌకీ, షేక్ పేట, మలక్ పేట, లాల్ దర్వాజ పలు ప్రాంతాల్లో ఫ్యామిలీ గెట్ టు గెదర్ లు ఏర్పాటు చేశారు. గృహిణులకు ఆటల పోటీలు నిర్వహించి మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తున్నారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసి కలిసి ఉంటే కలదు సుఖమనే సందేశాన్ని ఆచరణాత్మకంగా తెలియజేస్తున్నారు. పలు పాఠశాలల్లో పిల్లలకు కుటుంబ ఐక్యమత్యంపై వ్యాసరచన, ప్రసంగ పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలకూ కుటుంబ  ప్రాధాన్యతను వివరిస్తున్నారు. బంధాలు, బంధుత్వాల ప్రాధాన్యత వివరిస్తున్నారు. కుటుంబ వైభవాన్ని తెలియజేసేలా పలువురు మహిళా ప్రముఖుల సందేశాలు ఆలోచింపజేస్తున్నాయి.

లాక్ డౌన్ పిరియడ్లో గృహహింస కేసులు ఆందోళనకరంగా మారాయని, పిల్లలు, మహిళలు తీవ్ర వేధింపులకు గురయ్యారని జమాఅతె ఇస్లామీహింద్ నగర కార్యదర్శి ఆయెషా సుల్తానా ఆందోళన చెందారు. ఇంటిని చక్కదిద్దుకుంటేనే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో  పటిష్ట కుటుంబం ఉద్యమాన్ని చేపట్టామని ఆమె అన్నారు. ఫ్యామిలీ వ్యాల్యూస్ ను తెలియజేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ  వ్యవస్థను పునర్నిర్మించుకోవడంతోనే మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని తద్వారా శక్తివంతమైన దేశాన్ని సాధించవచ్చని ఆమె అంటున్నారు. ఒకప్పుడు ఇల్లంటే అమ్మానాన్నల ఆత్మీయతలు, ప్రేమ వాత్సల్యాలు, పెద్దల ఆశీర్వాదాలతో కళకళలాడేది. ప్రేమపరిళాలు వెదజల్లే మన ఇళ్లు ఇప్పుడు కళతప్పాయి. వైఫై మాయలో ప్రపంచమే ఇంట్లో ప్రత్యక్షమవుతున్న పక్కింటోళ్లెవరో తెలియడం లేదు. ఈ సంస్కృతిని రూపుమాపి మన కుటుంబ వ్యవస్థను పునర్నిర్మించుకోవాలన్న జమాఅతె ఇస్లామీహింద్  ఆలోచన ప్రశంసనీయం. ఈ ఫ్యామిలీ క్యాంపెయిన్ ను ముందు తీసుకెళుతున్న జమాఅతె ఇస్లామీహింద్ మహిళా నాయకులు ఖాలిదా పర్వీన్, ఆయెషా సుల్తానా (ఖమ్మం), సాజిదాబేగం, ఆసియా తస్నీమ్, రాహెలా ఖాన్, అస్మా జర్జరీ, సుమయ్య లతీఫీ తదితర మహిళా మణులకు నా సలాములు.  

✍️రిపోర్టింగ్-ముహమ్మద్ ముజాహిద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: