ఎస్పీజీ పాఠశాలకు క్రికెట్ కిట్ బహూకరించిన...

 నంద్యాల లయన్స్ క్లబ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల క్రికెట్ అసోసియేషన్ గత సంవత్సరం జనవరిలో నిర్వహించిన సచిన్ టెండూల్కర్ ట్రోఫీ విజేతగా నిలిచిన ఎస్పీజీ పాఠశాల జట్టుకు నంద్యాల లయన్స్ క్లబ్ శుక్రవారం పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో  క్రికెట్ కిట్ ను బహూకరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీవలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, కార్యదర్శి సందీప్, కోశాధికారి శివ కుమార్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ టెక్నికల్ కమిటీ చైర్మన్ దివాకర్, డయసిస్ సెక్రెటరీ స్టీఫెన్ పాల్గొని క్రికెట్ కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఎస్పీజీ పాఠశాలకు క్రీడలలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు. గత సంవత్సరం నంద్యాల క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన సచిన్ టెండుల్కర్ పాఠశాలల టోర్నమెంట్ లో ఎస్పీజీ పాఠశాల విజేతగా నిలిచినప్పుడు ఇచ్చిన హామీ మేరకు లయన్స్ క్లబ్ ఈ రోజు క్రికెట్ కిట్ ను అందచేసిందన్నారు. భవిష్యత్తులో కూడా పాఠశాలకు అవసరమైన క్రీడా పరికరాలు అందించడానికి సహకరిస్తామని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, అదేవిధంగా  బాగా చదివి ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ తరఫున ఎస్ పి జి క్రికెట్ జట్టుకు క్రీడా దుస్తులు కూడా ఇస్తామని ప్రకటించారు. ప్రధానోపాధ్యాయులు జీవలత మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు జానీ, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: