నైతిక విలువలతో కూడిన పాటలకు నిలయం...

అబ్దుల్లా జావిద్ యూట్యూబ్ ఛానల్ 

జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆయేషా సుల్తానా

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం జిల్లా ప్రతినిధి)

ఇల్లు స్వర్గసీమ ఇంట్లో దేవుని యొక్క ఆదేశాలు మరియు ప్రవక్త (స) బోధనలు అనుసరించటం వల్ల ఇల్లు స్వర్గసీమగా మారుతుంది అని అటువంటి గృహాలు ఆదర్శవంతమైన సమాజానికి పునాది వేస్తాయని అబ్దుల్లా జావిద్ యూట్యూబ్ ఛానల్ లో సాద్ మొసిన్, సారా సుమయ్య, సమ్రా సరూష్ పాడిన పాటను నేడు జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆయేషా సుల్తానా, జిల్లా మహిళా అధ్యక్షురాలు సైదా భాను, ఖిల్లా డివిజన్ అధ్యక్షురాలు రహిమున్నిసా బేగం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయేషా సుల్తానా మాట్లాడుతూ బలమైన కుటుంబ వ్యవస్థతోనే సమాజం బలపడుతుందని, బలమైన సమాజం ద్వారానే శక్తివంతమైన దేశాన్ని సాధించుకోవచ్చని ఆమె అన్నారు. సమాజంలో నెలకొన్నరుగ్మత లను దూరం చేయడానికి తమ వంతు బాధ్యతగా నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలని నిర్వహిస్తున్న అబ్దుల్లా జావిద్ యూట్యూబ్ ఛానల్ ను అభినందించారు పరిస్థితులకు అనుగుణంగా నైతికతలతో కూడిన పాటలు పాడి పెద్దలలో మరియు పిల్లలలో చైతన్యం తీసుకు వస్తున్నాం చిన్న పిల్లలు అయినా సాద్ మొసిన్, సారా సుమయ్య, సమ్రా సరూష్  లను ప్రత్యేకంగా అభినందించారు ముందు ముందు మరిన్ని నైతిక విలువలు పెంపొదించే వీడియోలు తీయాలని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: