కేర్ సామాజిక సంస్థ ఆధ్వర్యంలో..

పేద ముస్లిం లకు నిత్యావసర వస్తువుల పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం లోని రహమత్ పురం లో కేర్ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపకులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షత న పేద ముస్లిం లకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కేర్ సంస్థ అధ్యక్షులు థామస్ మాట్లాడుతూ
కేర్ సామాజిక సేవాసంస్థ కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి పై చైతన్యం తో పాటు కోవిడ్ సమయంలో ఆపదలో ఉన్న వారికి కుల మతాలకు అతీతంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ ప్రస్తుతము పీడిత సామాజిక వర్గాల వారికి వారున్న చోటికి వెళ్లి నిత్యావసర వస్తువులు చేర్పించి వసుధైక కుటుంబం లా మనమందరమూ సోదర భావం తో మత సామరస్యం తో ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. దాదాపు 150కుటుంబాల కు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమములో టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్ .షఫీఉల్లా ఖాన్.కేర్ స్వచ్చంధ సేవా సంస్థ సభ్యులు సునీతా. సంధ్య. లతా .సంజీవరాయుడు. ఉమర్. రియాజుద్దీన్త దితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: