చంద్రబాబును కలసిన కె.ఇ.ప్రభాకర్

స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

 (జానోజాగో వెబ్ న్యూస్-డోన్ ప్రతినిధి)

 కర్నూలు జిల్లా డోన్  నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ కె.ఇ.ప్రభాకర్  విజయవాడ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల దృష్ట్యా కె.ఇ.ప్రభాకర్  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ముచ్చటించారు. డోన్ నియోజకవర్గం లోని 81 గ్రామ పంచాయతీలలో వైసీపీ వారు ఏక గ్రీవం కోసం ప్రయత్నిస్తున్నారని. కానీ డోన్ నియోజకవర్గం లో 81 గ్రామపంచాయతీ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. వైసీపీ వాళ్లు బలవంతపు, ఏకగ్రీవాల కోసం, తప్పుడు కేసులు పెడుతున్నారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
అలాగే ప్రత్యేకంగా ప్యాపిలి మండలంలోని బూరుగల గ్రామంలో వైసీపీ వారు వన్ సైడ్ ఏకగ్రీవాల కోసం అన్ని విధాలుగా అధికారులు బలవంతం పెడుతున్నారని చంద్రబాబుతో కె.ఇ.ప్రభాకర్ అన్నారు. డోన్ నియోజకవర్గం లోని,ప్యాపిలి మండలం బెతంచేర్ల మండలం డోన్ మండలం లో,చాలా పంచాయతీలు ఇలాగే జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన ఎస్ఈసీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు, కార్యకర్తలకి అండగా ఉంటానని, ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా, కార్యకర్తలకు అ‌డగా ఉంటానని కె.ఇ.ప్రభాకర్ కు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: