సమస్యలను సత్వరమే పరిష్కరించుతాం

ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం పురపాలక సంఘాలకు ఎన్నికలు

సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 వినతిదారుల వినతుల సమస్యలను సత్వరమే పరిష్కరించుతామని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి దారుల నుండి సబ్ కలెక్టర్ కల్పనా కుమారి వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా స్థానికంగానే వారి వారి వినతులను సమర్పించి పరిష్కరించుకోవచ్చని,  సచివాలయాల ద్వారా గాని మండల పరిధిలోని తహసిల్దార్ కార్యాలయంలో సమస్యలు పరిష్కారం కానప్పుడు డివిజన్ స్థాయిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పించి వినతి లకు పరిష్కారం పొందవచ్చునన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నంద్యాల రెవెన్యూ డివిజన్ లో పురపాలక సంఘాలకు మార్చి రెండవ తారీకు నుండి మూడవ తారీఖు వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంకాలం నామినేషన్ల తుది జాబితా వెలువడుతుందని అన్నారు. 10వ తారీకు పోలింగ్ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రీ పోలింగ్ నిర్వహించవలసి వస్తే 13వ తారీఖున నిర్వహిస్తామని,  14వ తారీఖున ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా జరుగుతుందన్నారు. ఈరోజు వినతిదారులు సమర్పించుకున్న వినతులలో భూ సమస్యకు సంబంధించినవి, కుటుంబ సమస్యలకు సంబంధించినవి, వైయస్ నగర్ లో కొంతమంది ఇళ్ల పట్టాల జీనియన్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: