నంద్యాల రెవెన్యూ డివిజన్ లో ప్రశాంతంగా...

ముగిసిన తొలిదశ గ్రామ పంచాయతీల ఎన్నికలు 

జిల్లా డిప్యూటి ఎన్నికల అధికారిణి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల రెవెన్యూ డివిజన్ లో ప్రశాంతంగా, తొలిదశ గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్ ముగిసిందని జిల్లా డిప్యూటి ఎన్నికల అధికారిణి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. మంగళవారం  నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా  డిప్యూటీ ఎన్నికల అధికారిని,  నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ఎస్.ఈ.సి.నిబంధనల మేరకు పోలింగ్ ముగింపు టైం ఈ మద్యాహ్నం 3:30 వరకూ పోలింగ్ కేంద్రంలో క్యూ లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించునారని, నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని  పది మండలాలలో జరిగిన పోలింగ్ లో  84 .041 శాతం ఓట్లు పోల్ అయ్యాయన్నారు.
ఈ సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపని, ముందుగా వార్డు మెంబర్ల అభ్యర్థుల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత సర్పంచు అభ్యర్థుల ఓట్ల లెక్కింపని, చివరిగా ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపును ఎస్.ఈ.సి నిబంధనల మేరకు సంపూర్ణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పగడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులను, ఎంపిడిఓ లను, తహసీల్దార్లను, మండల లెవెల్ ఎన్నికల అధికారులను, పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు,  డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధమని, పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: