ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి

వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేత ఐ.ఎం.అహమ్మద్ డిమాండ్

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భీమసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉప సంహరించుకోవాలని కోరుతూ భీమా సేన ఆధ్వర్యంలో విశాఖ పట్నంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత నేతలు పి.పెంటారావు, ప్రభాకర్ రావు, భీమా సేన అధ్యక్షులు రవి సిద్దార్థ, అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ బొడ్డు కళ్యాణ్ రావు, బీ.ఎ.ఎం.సి.ఇ.ఎస్ నాయకులు రామ్ జీ తోపాటు, వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్ తోపాటు పలువురు కార్మిక, ప్రజా సంఘాల నేతలు, ముస్లిం సంఘాలు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్ మాట్లాడుతూ భుత్వాలు...పాలకులు వస్తూపోతుంటారు కానీ వ్యవస్థలు శాశ్వతం అని వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్ అన్నారు. పాలకుల కొన్ని విధానపరమైన నిర్ణయాల కారణంగా వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితి వస్తే దేశ పౌరులందరు గళం ఎత్తాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ రంగ వ్యవస్థలు పట్టిష్టంగా ఉన్నపుడే అంబేద్కర్ వల్ల దక్కిన రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు ఆస్కారముండదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ వల్ల ప్రభుత్వానికి ఎంతో లాభం వచ్చిందన్నారు. కేవలం రెండు, మూడేళ్లుగా నష్టం జరిగిందని ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదన్నారు. బడా వ్యాపారుల వేల కోట్ల రూపాయల రుణం మాఫి చేసిన కేంద్ర ప్రభుత్వం కేవలం కొద్దిపాటి నష్టాలను ఎదుర్కొంటున్న విశాఖ స్టీల్ ను ఆదుకోని ప్రభుత్వ రంగంలోనే వాటిని నడపలేదా అని ఆయన ప్రశ్నించారు. విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కల్పించుకొని ప్రధాని నరేంద్ర మోడీతో  మాట్లాడాలన్నారు. మోడీతో సత్ సంబంధాలున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని కేంద్రంకు తెలియజేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. విశాఖ స్టీల్ కు ఉక్కు గనులు కేటాయించి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండేలా కేంద్రంపై పవన్ కళ్యాణ్ ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు.





,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: