సేవచేసే భాగ్యం కల్పించండి

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

ప్రభుత్వం నిధులివ్వకపోతే.. సొంత నిధులతో అభివృద్ధి చేస్తా.

బిడ్డలా..సోదరుడిలా గెలిపించండి

స్వతంత్ర అభ్యర్థి శ్యామ్ సుందర్ లాల్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సేవచేసుకునే భాగ్యం కల్పించండి. ఒక్క అవకాశం ఇచ్చిచూడండి. వార్డులో ప్రభుత్వ నిధులు కేటాయించకపోతే సొంతనిధులతో అభివృద్ధి చేస్తా. బిడ్డలా, సోదరుడిలా భావించి గెలిపించాలని 12 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్, మారుతీ టౌన్ షిప్ లో ఒకవైపు అభ్యర్థి శ్యామ్, మరోవైపు ఆయన సతీమణి వాణి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో పోటీపడి గడప, గడపకు వెళ్లి చేతులెత్తి మొక్కుతూ ఒక్క అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
రెండు ప్రాంతాల్లో ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రచారంలో ప్రజలు మాట్లాడుతూ తెలుగుదేశం, వైసీపీ, బిజెపి ప్రభుత్వాలను చూసాం, ఎందరో కౌన్సిలర్లను చూశామని వార్డు సమస్యలు పట్టించుకున్నవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కౌన్సిలర్ ను చూసాం, నేటివరకు అడ్రస్ లేరని చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రచారంలో ఇంటింటా సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని అన్నారు.
వార్డు అభివృద్ధి ద్యేయంగా పోటీలో నిలబడ్డానన్నారు. బాలాజీ కాంప్లెక్స్, మారుతీ టౌన్ షిప్, ఆదర్శ నగర్, శ్రీదేవి నగర్, ములాన్ పేట ప్రాంతాల్లో ప్రభుత్వం నిధులు ఇవ్వని పక్షంలో సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. సేవచేసే భాగ్యం కల్పిస్తే మీ బిడ్డలా, సోదరునిలా మీ కష్టం, నా కష్టంగా భావించి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: