రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని భూస్థాపితం చేస్తాం

సీపీఎం నేతల హెచ్చరిక

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పాలని సీపీఎం పార్టీ పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్ ప్రజలపై భారాలు రాష్ట్రానికి అన్యాయం అంశంపై సిపియం మండల కార్యదర్శి యం. నాగేశ్వరరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపియం పార్టీ తూర్పు ప్రాంత జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఈనెల 2 వ తేదీన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది చాలా విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకున్నారు కానీ ఈ బడ్జెట్ ఆదాని  అంబానీ విజయ్ మాల్యా టాటా బిర్లా ఇలాంటి బడా బడా వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు తప్ప సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్ ద్వారా ఒరిగిందేమీ లేదని వారు ఘాటుగా విమర్శించారు.
ఈ యొక్క బడ్జెట్ ధనవంతులకు చాలా ఉపయోగపడుతుందని ఇది  వీ ఆకారం బడ్జెట్ అని మంత్రి అన్నారు కానీ  ఇది వీ ఆకారం బడ్జెట్ కాదు కే ఆకారం బడ్జెట్ అని వారు విమర్శించారు. అలాగే కిరోసిన్ పై అగ్రిసెస్ కూడా పెంచి ప్రజలకు పేను భారాలు మోపుతుంది ఈ బడ్జెట్ అలాగే రోడ్లు అన్ని కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పి వాటిని ప్రైవేట్ పరం  చేస్తుంది ఈ బడ్జెట్ చార్జీలు పెంచుకోమని టోల్ గేట్లు ఇష్టానుసారంగా మోత మోగించాడు ఈ బడ్జెట్ ఉందన్నారు అలాగే ఒకే జాతీయడు ఒకే రేషన్ కార్డు అనే దీని ద్వారా లక్షల వేల రేషన్ కార్డులు తీసివేసే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 15 కోట్ల మంది విద్యావంతులు ఉద్యోగాలు లేక ఉపాధి కోల్పోయి ఇప్పుడు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు వారికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు అధికారంలోకి వచ్చే ముందర సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు వాటిని గురించి పార్లమెంట్లో అసలు చర్చించాక పోవడం విచారకరమన్నారు. విద్యుత్తును ప్రైవేటుపరం చేస్తు, రైతులకు నష్టం కలిగించే మూడు నూతన వ్యవసాయ చట్టాల పై రైతులు 75 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంటులో మోడీ ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు.
రైతులను నిలువుగా ముంచేసే బడ్జెట్ ఇది అని వారు విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ నందికొట్కూరు ఇన్చార్జి అశోక రత్నం, ఆవాజ్ కమిటీ నాయకులు అబూబకర్, మాలమహానాడు తాలూకా అధ్యక్షులు శివప్రసాదు ,బీసీ సంఘం నాయకులు కురుమూర్తి ,ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి నాయకులు ప్రసాదు, న్యూ డెమోక్రసీ కార్యదర్శి అర్లప్ప ,ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు నాగరాజు మాట్లాడుతూవిడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో మొండి చెయ్యి చూపారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పకీర్ సాహెబ్, శ్రీనివాసులు,ఈశ్వరమ్మ, ఓబులేసు, రజిత, వి.వెంకటేశ్వర్లు. డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మర్రి స్వామి నాయకుడు ముత్తు. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు దర్గయ్య ,కుమారు నాయకులు చెన్నయ్య, రాము, శ్రీకాంత్. రైతు సంఘం నాయకులు సుధాకరు, రామిరెడ్డి. ఐద్వా మండల కార్యదర్శి  సాజిదాబి, సి ఐ టి యు నాయకులు చంటి  తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: