వసంత పంచమి సందర్భంగా..

ఎల్ కెఆర్ గ్లోబల్ స్కూల్ నందు..అక్షరాభ్యాసం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణం ఎల్ కె ఆర్ గ్లోబల్ స్కూల్ నందు వసంత పంచమి సందర్భంగా అక్షరభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్ కె ఆర్ స్కూల్ చైర్మన్ జె.లక్ష్మి కాంత్ రెడ్డి, డైరెక్టర్ జుపల్లె మురళి నాథ్ రెడ్డి, జుపల్లె కళ్యాణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వసంత పంచమి పవిత్రమైన పర్వదినం ఈరోజు విశిష్టత చిన్న పిల్లలకు సరస్వతి దేవి ఆలయము నందు అక్షరాభ్యాసం చేయించినచో విద్యా ప్రాప్తి లభిస్తుందన్నారు. ఈ వసంత పంచమి పర్వదినాన సరస్వతి దేవి పుట్టినరోజు ఆ అమ్మవారికి శక్తి ప్రతిష్ఠమైన రోజు, చదువులతల్లిని మనసారా పూజించి నమస్కరిస్తే విద్యార్థులకు చక్కటి విద్య అభ్యాసం అవుతుందన్నారు.
అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం తల్లిదండ్రులు  మాట్లాడుతూ ఎల్ కె ఆర్ గ్లోబల్ స్కూల్ నందు విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ చక్కటి క్రమశిక్షణ కలిగిన విద్యాలయం ఈ స్కూల్ నందు మా పిల్లలు విద్యాభ్యాసం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే చైర్మన్,  డైరెక్టర్లు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ప్రతి క్లాస్ రూమ్ శానిటేషన్ చేసి, ప్రతి విద్యార్థి కరోనా నియమాలు పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చూస్తే పిల్లల పట్ల ఎల్ కె ఆర్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: