నాలుగు విడతలోనూ వైసీపీ మద్దతు దారులు ఘన విజయం

వైఎస్ జగన్ కు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ

ఆదరించి,ఘన విజయం చేకూర్చిన ఓటర్లకు కృతజ్ఞతలు

రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అండ్ కంపెనీ ఎన్ని కుట్రలు పన్నినప్పటికి రాష్ట్రంలో జరిగిన 4 విడతల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు దారులు నూటికి 95 % ఘన విజయం సాధించడం హర్షణీయమని, ఈ సందర్భంగా ఓటర్ల దేవుళ్ళకు  రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు జరిగితే వైసీపీ విజయం సాధిస్తే తమ పార్టీ పరువు పోతుందనే భయంతో చంద్రబాబు ఎన్నికలు జరగకుండా వుండేందుకు అనేక కుట్రలు చేసి చివరకు కోర్టు వెళ్లారని విమర్శించారు. స్వతంత్ర  ప్రతిపత్తి ఉండాల్సిన ఎన్నికల కమిషన్ తన పరిధిని దాటి చంద్రబాబుకు కొమ్ముకాసి ప్రజాస్వామ్య వ్యవస్థ ను బ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించిందని  తీవ్రంగా విమర్శించారు.
అయినప్పటికీ మన రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఓర్పుతో వ్యహరించి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్ పాలనకు మెచ్చిన ప్రజలు పార్టీలకు,వర్గాలకు, కులాలకు, మతాలకు,ప్రాంతాలకు రహితంగా వైసీపీ ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచ్ లను గెలిపించారని అన్నారు. త్వరలో జరగబోవు మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాలు తిరిగి పునరావృతం కానున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు కు పట్టుకొమ్మ గా వున్న కుప్పం నియోజకవర్గంలోనే 85 గాను 70 పంచాయతీ లలో అక్కడి ప్రజలు వైసీపీ అభ్యర్థులను ఆదరించి గెలిపించారని, దీన్ని బట్టి ప్రజలు జగన్ పాలనపై ఎంతో నమ్మకంతో ఉన్నారని అర్ధమవుతుందని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.



,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: