రావూస్ జూనియర్ కళాశాలలో..

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు

-పాల్గొన్న ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రావూస్ జూనియర్ కళాశాల నందు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన సదస్సు నిర్వహించినట్లు రావుస్ కళాశాల చైర్మన్ ఎఎంవి అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే మాటలు వినాలని తెలియజేశారు. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల పైన ఒత్తిడి తెచ్చి అవసరం లేకుండా పెద్ద పెద్ద బైక్ లు నడుపుతూ, శబ్దాలు చేస్తూ, పట్టణంలో కళాశాల వద్ద తిరుగుతున్నారని అలాంటివారిని పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోదని,  చట్ట ప్రకారము శిక్షించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రోడ్డు సుంకయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు కనీసం నెలకు రెండు సార్లు అయినా కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్ ను సంప్రదించి విద్యార్థి యొక్క నడవడికను గాని, మార్కులు గాని తెలుసుకోవాలని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఒక లక్షా యాభై వేల పైబడి విలువ గల స్పోర్ట్స్ బైకులు కుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలియజేశారు. రోడ్డుపైన వెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళినప్పుడే ఎదుటి వారిని కూడా రక్షించిన వారమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మదన్, షరీఫ్, చంద్రశేఖర్, ఫిజికల్ డైరెక్టర్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: