ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ 

వాలంటీర్ తీరుపై స్థానికంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పాత్రను ఓ వాలంటీర్ భుజాన ఎత్తుకొన్నాడు. అది ఎక్కడ అనుకొంటున్నారా...? కర్నూలు జిల్లా గడివేములకు చెందిన వాలంటీర్ తెలుగు శ్రీధర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లుగా కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల కర్రపత్రాలను చేతబటిన ఫోటోలను జానోజాగో వెబ్ న్యూస్ గడివేముల ప్రతినిధి దాసరి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత ఫోటోలను కూడా అందజేశారు.
ఎన్నికల కర్ర పత్రాలతో వాలంటీర్ తెలుగు శ్రీధర్
ఇదిలావుంటే ఎన్నికల ప్రచారాలకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గడివేముల కు చెందిన వాలంటరీ తెలుగు శ్రీధర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రచారం చేస్తూ గడివేముల లో ఓటర్లను ఓటు వేయమని ప్రచారం లో పాల్గొంటున్నాడని స్థానికంగా ఉన్న కొందరు ఆరోపణలు చేస్తున్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: