అభివృద్ధి చేసిచూపిస్తా ఆదరించండి

బాలాజీ కాంప్లెక్స్ లో ఇంటిటా ప్రచారం

కండే శ్యాం సుందర్ లాల్ కు ఘనస్వాగతం  పలుకుతున్న ప్రజలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)                  

నంద్యాల పట్టణం 12 వ వార్డులో ప్రచారం ఊపందుకుంది. ఇంటింటా ప్రచారంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కండే శ్యాం సుందర్ లాల్ ఇంటింటా ప్రచారం రెండవరోజు కొనసాగుతుంది. బాలాజీ కాంప్లెక్స్ లో ఇంటింటా తిరుగుతూ పెద్ద, చిన్నా అనే భేదం లేకుండా అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల్లో ఆదరించాలని కోరుతున్నారు. ఇండ్లు, దుకాణ, వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్స్, చిరు వ్యాపారస్తులతో కలిసి కౌన్సిలరుగా గెలిపించాలని కోరుతున్నారు. వార్డులో శ్యామ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సుపరిచితుడు  కావడంతో అందరూ స్వాగతిస్తున్నారు. కులమథసలకు అతీతంగా అందరిని అక్కా, బావ, మామ, అయ్యా అంటూ తనదైన శైలిలో ప్రచారాన్ని ఉదృతం చేశారు.
రామజన్మ భూమి నిర్మాణానికి విరాళాలు సేకరణ, కోవిడ్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంచడంతో గుర్తుపట్టిన అవ్వా, తాతలు ఆశీర్వదిస్తున్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇవ్వాలని,వార్డు సమస్యలు పరిష్కరిస్తానని శ్యామ్ చెప్పుకొస్తున్నారు. పాత్రికేయ వృత్తిలో ఉండటం, ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో అభిమానంతో పలువురు ఆయన వెంట ప్రచారంలో పాల్గొంటున్నారు. మరో వైపు ఆయన సతీమణి ఇంటిటికి తిరిగి మహిళలకు బొట్టుపెట్టి ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నారు. మహిళలు పెద్ద ఎత్తున వారివెంట ఉండటం విశేషం. ప్రచారంలో వార్డు పెద్దలు, యువత, స్నేహితులు పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: