విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేస్తే..

బీజేపీకి పుట్టగతులు ఉండవు

జానోజాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దానికోసం ఎంతోమంది త్యాగం చేసి సాధించుకున్నారని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేయడానికి కి  చర్యలు చేపట్టడం దుర్మార్గమైన చర్య అని               జానోజాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎన్నో వేల మందికి ఉపాధి లభిస్తుందని అటువంటి దాన్ని ప్రైవేట్ పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అని అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో ఉన్న జగన్ నోరు మెదపక పోవడం చాలా విడ్డూరమన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాధంతో సాధించుకున్న దానిని ఈ రోజు బిజెపి కేంధ్ర ప్రభుత్వం ప్రవేయిట్ పరం చేయడానికీ చర్యలు చేపట్టడం ఏంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు, కడప ఉక్కు అనేవి కేంద్ర ప్రభుత్వం భిక్ష కాదు అని అది ఆంధ్రుల హక్కు అనీ ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ని బీజేపీ ఈ దేశం లో ప్రభుత్వ రంగ పరిశ్రమ లను బజారూ లో అంగడి సరకులగా అమ్మేస్తూ తద్వారా కార్పొరేట్ లకు ఊడిగం చేస్తోందన్నారు. లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ విశాఖ ఉక్కు ని నిలబెట్టుకోవడం లో కేంద్ర ప్రభుత్వ పాత్ర కానీ బీజేపీ పాత్ర కానీ శూన్యం అన్నారు. ఆలాంటి మీరు ఈ రోజు గంగి గోవు లాంటి పరిశ్రమ ని అమ్మేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు. విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేడు దాని ఉసేత్తడం లేదన్నారు. విశాఖ ఉక్కు 32 మంది అమరుల త్యాగ ఫలితం అన్నారు. కనీసం 2 లక్షల మంది ప్రత్యక్షంగా జీవనం కొనసాగిస్తున్నరన్నారు. విశాఖ నగరానికి ఉక్కు పరిశ్రమ పెద్ద దిక్కు అని ఎలా అమ్మేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న పరిశ్రమని అమ్మేస్తే చూస్తూ ఊరుకొనే సమస్యే లేదన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, పిచ్చి వాళ్ళను అధికారం లో వస్తే ఎలా ఉంటుందో ఉదాహరణ ఈ ప్రభుత్వాలు అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతి పక్ష పార్టీ లకు ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రజల మీద చిత్త శుద్ధి ఉన్నా వెంటనే ఉక్కు పోరాటం లో  పాల్గొనాలని డిమాండ్ చేశారు. ప్రజలు తిరుగుబాటు మిమ్మల్ని గద్దె దించక ముందు కడప, విశాఖ ఉక్కు ని సాదించుకోవలన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: