సీఎం ఖండించకపోవడం శోచనీయం

పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు

కేసును సీబీఐకి అప్పగించాలి

టీపీసీసీ  అధ్యక్షుడు ఉతమ్ కుమార్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైకోర్టు న్యాయ వాది గట్టు వామన రావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఖండించకపోవడం శోచనీయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వామన రావు తండ్రి తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. హత్యకు గురైన వారి దంపతుల కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కేసును సీబీఐకి అప్పగించాలి అని తెలిపారు. ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోందని అన్నారు.  పోలీసులు సైతం నిందితులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయ వాదుల హత్య కేసులో నేతల ప్రమేయం ఉందనే విషయం బట్టబయలు అవుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి నోరు విప్పడం లేదని ప్రజలు గుర్తించాలని తెలిపారు. కేసును ప్రభుత్వం నీరుకారుస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గవర్నర్ తమిళ సై ను కలిసి వినతపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. సీనియర్ న్యాయ వాది శివకుమార్ మాట్లాడుతూ న్యాయ వాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 9 వ తేదీన """ చలో హైదరాబాద్ """ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీలకతీతంగా న్యాయ వాదులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. అన్నీ జిల్లాలకు చెందిన బార్ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని విన్నవించారు. 

✍️రిప్టోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్. హైద్రాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: