కొనసాగుతోన్న నిరసనల పర్వం

ఎమ్మెల్సీ రాంచందర్ రావు హాజరు

న్యాయ వాదులకు ప్రత్యేక చట్టం వచ్చే వరకు పోరాటం


 నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాంచందర్ రావు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైకోర్టు న్యాయ వాది గట్టు వామన రావు దంపతుల హత్య పట్ల శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో రెండవ రోజు నిరసనల పర్వం కొనసాగుతోంది. న్యాయ వాదులకు రక్షణ కల్పించాలని, కేంద్ర .. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయ వాదులకు ప్రత్యేక చట్టం రూపొందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ న్యాయ వాదుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలని అన్నారు. నిందితులు ఏ పార్టీ కి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమని, న్యాయం కోసం పోరాడే న్యాయ వాదులకు రక్షణ కరువైతే సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని తెలి


పారు. పార్టీలకతీతంగా న్యాయం కోసం న్యాయ వాద వృత్తి ధర్మాన్ని కాపాడే న్యాయ వాద దంపతుల హత్య కిరాతకమని అన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి హత్యకు గురైన కుటుంబాన్నీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే న్యాయ వాదు లకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని అన్నారు. నిందితులకు ఉరశిక్ష పడేలా పోలీసులు సాక్షాలని కూడగట్టాలని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు, అడ్వకేట్ జనరల్ సాక్ష్యాధారాలు సేకరించి సమగ్ర నివేదికను మార్చి 1నాడు సమర్పించాలని చీఫ్ జస్టీస్ కోహ్లీ ఆదేశించడం హర్షణీయమన్నారు. బార్ కౌన్సిల్ సభ్యులు కొండారెడ్డి మాట్లాడుతూ శనివారం వారి కుటుంబాన్నీ పరామర్శించి అండగా నిలుస్తామని అన్నారు. చట్టం ప్రకారం శిక్ష ఖరారు అవుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కోసం చట్టాన్ని ఎర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. న్యాయ వాద వృత్తిలోకి మహిళలు అధిక సంఖ్యలో వృత్తిని చేపట్టేలా చట్టాన్ని తయారు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  మాజీ అధ్యక్షుడు ఎల్.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిందితులకు పోలీసులు, ప్రభుత్వం అండ దండాలు ఉండకూడదని అన్నారు. కఠినంగా శిక్షించే విధంగా సెక్షన్ల ను నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ గంగా హత్యకు గురైన వారి దంపతుల గురించి తన పాట ద్వారా పాడి  అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్ సైతం ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా ప్రతీ ఒక్క న్యాయ వాది నిరసనల లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

 ✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్.హైద్రాబాద్
 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: