ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

పోలింగ్ కేంద్రాలకు కౌంటింగ్ మెటీరియల్ జాగ్రత్తగా పంపాలి

మున్సిపల్ కమిషనర్ డి. కె. బాలాజీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూలు నగక పాలక సంస్థ పరిధిలో ఎన్నికలను పగడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు నగరపాలక సంస్థ సమావేశ భవనంలో మున్సిపల్ ఎన్నికలపై ఆర్ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డీకే. బాలాజీ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు అందరూ మునిసిపల్ ఎన్నికలను పగడ్బందీగా, నిష్పక్షపాతంగా, విజయవంతంగా నిర్వహించడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ ఎన్నికలలో విత్ డ్రాల్స్ చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించి ప్రత్యేక రిజిస్టరు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభ్యర్థుల విత్ డాల్స్, ఎన్నికల ఖర్చులు, నామినేషన్ల ఫారమ్స్ నింపే విధానం, పోస్టల్ బ్యాలెట్లు, కౌంటింగ్ నిర్వహించే విధానం, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, వంటి సూచనలు సలహాలను ఆర్ వో లు ఏ ఆర్ వో లకు వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వ ర్, అర్ఓలు, ఏఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: