నంద్యాల శాఖ గ్రంథాలయానికి..

రెండు వేల రూపాయల విలువగల గ్రంథాలు  విరాళం

నంద్యాల గ్రంథాలయ లైబ్రేరియన్ జిలాలు బషీర్ అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూల్ జిల్లా నంద్యాల శాఖ గ్రంథాలయానికి రెండు వేల రూపాయల విలువగల గ్రంథాలను విరాళంగా ఇచ్చారని నంద్యాల గ్రంథాలయ లైబ్రేరియన్ జిలాలు బషీర్ అహ్మద్ అన్నారు. శనివారం పద్మావతి నగర్ లోని  గ్రంధాలయ భవనంలో లైబ్రేరియన్ జిలాలు బషీర్ అహ్మద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కార్యాలయంలో సూపరిండెంట్ గా పదవి విరమణ పొందిన శివరామకృష్ణ గ్రంథాలయానికి రెండు వేల రూపాయల విలువగల ఆధ్యాత్మిక గ్రంథాలను విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. గ్రంథాలయ సంస్థ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ గ్రంథాలయ సంస్థ పాఠకుల కొరకు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం సమయాలలో తెరిచి ఉంటుందని,  ఇక్కడికి వందల సంఖ్యలో పాఠకులు వస్తుంటారని, పాఠకులకు గ్రంథాలయంలో అనేక రకాల గ్రంధాలు, దిన, వార, మాస పత్రికలు పాఠకులకు అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాల మధ్య ఈ గ్రంథాలయం నడుస్తుందన్నారు. ఎవరైనా విలువైనటువంటి పుస్తకాలను కూడా గ్రంథాలయానికి విరాళంగా ఇస్తే వాటిని పాఠకులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సిబ్బంది గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.



 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: