వైయస్ జగన్ తండ్రి ఆశయాలను నెరవేరుస్తాడా? 

ఎంపీ, ఎమ్మెల్యేల లాభాల కోసం పని చేస్తాడా? 

రాజన్న రాజ్యం తీసుకొస్తామన్న జగన్  హామీల అమలు ఏది

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు చేసే పోరాటం 100వ రోజు కు చేరుకుందని, వైయస్ఆర్ బొమ్మ ముందు 100 అంకెలాగా కూర్చుని నిరసన తెలిపి వైయస్ జగన్ తండ్రి ఆశయాలను నెరవేరుస్తాడా? ఎంపీ, ఎమ్మెల్యేల లాభాల కోసం పని చేస్తాడా? రాజన్న రాజ్యం తీసుకొస్తామన్న జగన్  హామీల అమలు ఏది అని నాయకులు నిలదీశారు. నంద్యాల అభివృద్ధిపై ఎంపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని, అభివృద్ధి చెందిన నంద్యాలను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించడంలో ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని మించిన వారు లేరని, ప్రపంచం, దేశం  గుర్తించే విధంగా పరిశోధన లలో విత్తనాభివృద్ధి సరికొత్త వంగడాలు సృష్టించడంలో జరుగుతుంటే అన్ని రకాల విత్తనాలకు అనువుగా ఉంటున్న పచ్చటి పొలాలను బీడు భూములంటూ కోర్టులను సైతం మోసం చేయడంలో దిట్ట అంటూ 100వ రోజు సిఐటియు ఆధ్వర్యంలో 100 అంకెలాగా కూర్చుని  ఆర్ఏఆర్ఎస్ కార్మికులు, ఉద్యోగులు నిరసన చేపట్టారు.
గత ఎన్నికల్లో ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎన్నుకున్నందుకు నంద్యాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,  అభివృద్ధి చెందిన వాటిని నాశనం చేసి ఏవిధంగానైనా లాభం పొందాలనే ఆలోచన చేస్తున్నారని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నా అది కేవలం ప్రజా ప్రతినిధులకు మరిన్ని లాభాలు సంపాదించుకోవాలనే విధంగా ఉందని, ఇటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు ప్రజలంతా బాధ పడాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులంతా  ఒక్కటై వైసీపీని ఓడించి నంద్యాల అభివృద్ధి కోరుకునే వారిని ఎన్నుకోవాలని, నంద్యాలలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులను ఓడిస్తే వైసిపి ప్రభుత్వానికి, ఎంపీ, ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం వస్తుందని, అప్పుడైనా నంద్యాల అభివృద్ధి కోసం పని చేస్తారని సిఐటియు అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అదే విధంగా నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి చింతల మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు  చింతలయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మస్తాన్ ఖాన్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శులు శివ, లక్ష్మణ్, మోటర్ వర్కర్స్ యూనియన్  నాయకులు వీర సేన పాల్గొని మాట్లాడుతూ ఆర్ ఏ ఆర్ ఎస్ అభివృద్ధి కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ఆర్ ఏఆర్ఎస్ లో వైద్య కళాశాల ఏర్పాటు ఎంపీ, ఎమ్మెల్యేల లాభార్జన కోసమేనని, సీఐటీయు ఆధ్వర్యంలో 100 రోజులుగా నిరసన తెలుపుతున్నారని, 1906 సంవత్సరం నుండి నేటి వరకు అభివృద్ధి చెందుతూ ఉందని అటువంటి ఆర్ఏఆర్ఎస్ ను నాశనం చేయవద్దని ఎంపీ ఎమ్మెల్యేలకు కార్మికులు 100 రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం వైద్య కళాశాల ఇతర భూముల్లో నిర్మించేందుకు పునరాలోచన చేయాలని, ఆర్ ఏఆర్  ఎస్ భూములను కాపాడుకోవడం కోసం కార్మికులు, ఉద్యోగులు పోరాడుతున్నారని, ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వైద్య కళాశాల నిర్మించాలనుకోవడం సరైనది కాదని, ఇతర భూముల్లో వైద్యకళాశాల నిర్మించేందుకు పునరాలోచన చేసి నంద్యాల అభివృద్ధికి కృషి చేయాలని, వైయస్సార్ రాజ్యమంటే రైతులను, కార్మికులను నాశనం చేయడమేనా? అన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి నంద్యాలలో సెంటీనరీ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంలో ఆర్ఏఆర్ఎస్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని, అప్పుడే నిజమైన రాజన్న రాజ్యం కోసం కృషి చేసిన వారవుతారని, రాజన్న ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరిస్తే వైఎస్సార్ సంతోషిస్తారన్నారు. వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కోసమే పాలన సాగిస్తుందని,రైతులను, కార్మికులను విస్మరిస్తే పుట్టగతులుండవని, ఆర్ఏఆర్ యస్ కార్మికులు,  ఉద్యోగులు 100 రోజులుగా ఉద్యమం చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్ఏఆర్ఎస్ యూనియన్ నాయకులు ఎ.వి.రమణ, ఖాదర్ వలి, గోపాల్, ఎల్లమ్మ, పుల్లయ్య, నాగేశ్వరమ్మ, అయ్యన్న, మైమున్నీసాలతోపాటు వందలాది మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: