పాశ్చత్య సంస్కృతి వైపు దృష్టి పెడుతున్న..

 యువతలో మార్పు తీసుకురావాలి

జమాతే ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షురాలు నాసెరా ఖానం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

మానవ సమాజానికి నాగరికత నేర్పవలసిన కుటుంబం నేడు భౌతికవాదం, ఉదారవాదాల సుడిగుండంలో పడి ఉనికిని కోల్పోతున్న తరుణంలో కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించడం నేడు అవసరం ఉందని జమాతే ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షురాలు నాసెరా ఖానం అన్నారు.జమాతే ఇస్లామి హింద్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన గొప్పా ధార్మిక సభకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతు  పెళ్ళి చేసుకోకుండా ఆడమగ కలిసి ఉండే సంస్కృతి, దీనికి చట్టపరమైన అనుమతులు అమెరాకాలోనే కాదు మనదేశంలోనూ ఉన్నాయి. పెళ్ళికి ముందు సెక్స్ సంబంధాలు, వివాహేతర సంబంధాలు తదితర పాశ్చత్యపెడధోరణులు మన కుటుంబ వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారాయి. సామాజిక విలువలు పతనమవుతున్నాయి.
తండ్రెవరో తెలియని పిల్లల్లోనే అధిక నేరప్రవృత్తి అలవడుతుందని నివేదికలు చెబుతున్నాయి.అలాంటి పిల్లలు సమాజానికి ప్రమాదకారిగా మారుతున్నారు.కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఉద్దేశంతో జమాఅతె ఇస్లామీ హింద్ పది రోజుల పాటు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. నేడు కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుందని దానికి కారణాలు అనేకం. వివాహం లేకుండానే సహజీవనం గడపాలనే ఆలోచన యువతీ, యువకులలో పెరుగుతుందని. వ్యభిచారం,అక్రమ సంబంధాలు పెరగడం, నేడు అమ్మాయిల వివాహం కష్టతర మవ్వడం లాంటి అనేక సమస్యలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయిని అన్నారు. నేడు మానవ సమాజం పటిష్టంగా, ఆరోగ్యంగా, స్థిరంగా ఉంటే ఒక అనందదాయక క్రీయాశీల సమాజాలు రూపుదిద్దుకుంటాయిని అన్నారు. జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర సలహామండలి సభ్యరాలు అర్జుమన్ రజ్వీ మాట్లాడుతు కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం అనేది ఇస్లామ్ తోనే సాధ్యంఅని ఇస్లామ్ బోధనల వెలుగులోనే కుటుంబ నిర్మాణం జరగాలి. పిల్లలకు, యువతకు ఇస్లాం శిక్షణ ఇప్పించాలి. పాశ్చాత్య సంస్కృతి నుంచి, దురాచారాల నుంచి వారిని కాపాడాలి వారు మంచిని స్థాపించడం, చెడును నిర్మూలించడంలో తమ పాత్ర పోషించాలి.

వారు తమ హక్కులు, విధులు సక్రమంగా నిర్వర్తించే సరైన భావన కలిగి ఉండాలని అన్నారు.పాశ్చాత్య సంస్కృతికి ముస్లిమ్ కుటుంబాలు కూడా వాటికి ప్రభావితం అవుతున్నాయి.ఇస్లామీయ విలువలతో కూడిన జీవన విధానం మన కుటుంబాలలో కూడా రావాలి అన్నారు.మరో అతిది జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆయేషా సుల్తానా మాట్లాడుతు ఇల్లంటే ప్రేమ, ఆప్యాయతలనే ఇటుకలతో నిర్మిచేదే ఇల్లు ప్రేమానురాగాలే ఇంటికి కప్పవ్వాలి త్యాగం, శ్రేయోగుణం ఆ ఇంటి గుమ్మమవ్వాలి ఇల్లు ఆనందాలకు నిలయమవ్వాలి కుటుంబంలో అనురాగాలు వెల్లివిరియాలి నాన్న నవ్వు, అమ్మ ప్రేమ కలగలిస్తేనే ఇల్లు బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడాలి ఇవన్నీ కలగలిసిన గృహమే స్వర్గసీమగా విరాజిల్లుతుందని అన్నారు అలాంటి వారింట్లో మనుషులు మాట్లాడుకోరు గుండెలు మాట్లాడుకుంటాయి ఇల్లంటే అద్దాల మేడ మాత్రమే కావాల్సిన పని లేదు. అది పూరి గుడిసె అయినా ఫరవాలేదు. భార్యాభర్తల అన్యోన్యత, తోబుట్టువుల మధ్య ప్రేమ, అనురాగంతో ఆ ఇంట్లో సంతోషాలు విరబూస్తాయి ఇలాంటి ఆదర్శ కుటుంబాలే ఆదర్శవంతమైన సమాజానికి పునాదిని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, సైదా భాను, ఖిల్లా డివిజన్ అధ్యక్షురాలు రహిమున్నిసా బేగం,ఇందిరా నగర్ డివిజన్ అధ్యక్షురాలు వహెదా,ఇస్లాం పేట డివిజన్ అధ్యక్షురాలు ఫాతిమా బేగం గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఖమ్మం శాఖ అధ్యక్షురాలు సోబియా అఫ్ఫాఫ్, కార్యదర్శి రిహానా, కార్యకర్తలు ఆమీనా నస్రీన్, ఆసియా, అయేషా జబీన్ , సీమ , అస్ఫియ అంజుమ్, సమీనా అఫ్రోజ్, నస్రీన్, హజీరా,షాజియ,  సమినా అఫ్రోజ్, హుస్సేన్ బి, ఆరీఫాబేగం ,జోహార, తాహరా, రాఫియా,సాలేహ, నిలోఫర్, నాజియా, సాజిదా ఫిర్దౌస్, తస్లీమ్, నుస్రత్, నసీం సాహెర్ , తాహెరా , నూర్జహాన్, ఆంజమ్, ముంతాజ్, కరీమా పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: