పత్తికొండలో కోటి రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల...

నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీదేవి  భూమి పూజ

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ  అ మేజర్ పంచాయతీ  పట్టణంలో  కోటి రూపాయలతో  సిసి రోడ్లు  ప్రారంభం  ఎమ్మెల్యే శ్రీదేవి చేతుల మీదుగా  భూమి పూజ  మంగళవారం  చేశారు పత్తికొండలో కోటి రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీదేవి  భూమి పూజ చేసి ప్రారంభించారు. పత్తికొండ పట్టణంలో స్థానిక లక్ష్మీ నగర్, రామకృష్ణ నగర్ లలో సిసి రోడ్డు , డ్రెయినేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

చిన్నపాటి వర్షం పడినా లక్ష్మీ నగర్ కాలనీలో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో కాలనీవాసుల సమస్యలను ఎమ్మెల్యే శ్రీదేవిస్వయంగా పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఎమ్మెల్యే గారి నిధులతో సుమారు 80 లక్షల రూపాయలు మంజూరు చేయించి పనులు ప్రారంభం అయ్యేలా ఎమ్మెల్యే శ్రీదేవి చొరవ తీసుకున్నారు.
రామకృష్ణ నగర్ లో రెండు లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించిన తీరు పట్ల కాలని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దీపిక,మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , రామకృష్ణ నగర్ వార్డ్ మెంబర్  విజయలక్ష్మి  మేజర్ గ్రామ పంచాయతీ ఈఓ కృష్ణ కుమార్ , పంచాయతీ రాజ్ అధికారులు శేషయ్య, మాణిక్యాలరావు, వెంకటేశ్, మరియు వైయస్సార్ నాయకులు బజారప్ప, పల్లె ప్రతాపరెడ్డి, శ్రీరంగడు, సోమ శేఖర్, కొమ్ము నెట్టికళ్ళు భాస్కర్ నాయక్, కాంట్రాక్టరు మురళి దూదెకొండ సర్పంచ్ రహిమాన్ వార్డు ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.




 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: