కరోనా సెకండ్ వేవ్...ఎఫెక్ట్

ప్రమాదం ఇంకా పోంచేవుందా...?

కువైట్ విమానాయశాఖ ఆకస్మిక ప్రకటన వెనక... 


కరోనా వైరస్ అంతమవుతోందనుకొంటున్న వేళ సెకండ్ వేవ్ అన్నది మరోసారి వణికిస్తోంది. కువైట్ ప్రభుత్వం జారీచేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కరోనా కష్టాలు తలుచుకొంటేనే అందరిలో వణుకుపుడుతోంది. యావత్తు ప్రపంచం ఈ కష్ట, నష్టాలను చూడటమే ఇందుకు కారణం. కావున ఇక కరోనా పోయిందని నిర్లక్ష్యంగా వ్యవహరించంకుండా అప్రమత్తతో ధైర్యంగా జీవించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

గత రెండు రోజులుగా నిషేధిత దేశాల  నుండి ప్రవాసీలు  డైరెక్ట్ గా కువైట్ రావడానికి ఆమోదం తెలిపినట్టు విడుదల చేసిన సర్కూలర్ అకస్మాత్తుగా డీజీసీఏ తన  ట్విట్టర్ ఖాతాలో ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు తదుపరి నోటీసులు వచ్చేవరకు ప్రవాసీలు రాకను నిలిపివేసింది.    కేవలం కువైటీ పౌరులకు మాత్రమే కువైట్ లో హోటల్ క్వారైంటైన్ 7 రోజులు బుక్ చేసుకోవాలని మిగతా 7 రోజులు ఇంట్లో క్వారైంటైన్ లో ఉండాలని తెలిపింది.

అర్ధరాత్రి తాజాగా విడుదల చేసిన సర్కూలర్ 

ప్రవాసీలు డైరెక్ట్ గా కువైట్ రావడానికి తదుపరి నోటీసులు వచ్చేవరకు  నిషేధం కొనసాగించాలని కువైట్ విమానాశ్రయం లో పనిచేసే అన్ని విమానయాన శాఖలకు విమానాయశాఖ ఆదేశించింది. ఈ సర్కూలర్ ప్రకారం  కువైటీ పౌరులు, దౌత్య అధికారులు, కువైటీ పౌరులతో వుండే వారి గృహకార్మికులు ,వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అనుమతించనున్నారు.

కర్ఫ్యూ పరిస్థితుల దిశగా సిద్ధమవండి...అధికారులకు కువైట్ ఆదేశాలు

గల్ఫ్ దేశాల్లో కొన్నాళ్లుగా కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందా? మరోసారి కువైట్ కర్ఫ్యూ  పరిస్థితులను ఎదుర్కొబోతోందా? కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి వెలువడుతున్న ఉత్తర్వులు, సన్నాహఆలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. తగ్గిందనుకున్న కోవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రత కువైట్ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతూ వస్తోంది. దీంతో సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ...దేశంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఒక వేళ మళ్లీ కర్ఫ్యూ దిశగా పరిస్థితులు దిగజారినా..అందుకు తగినట్లు సన్నద్దంగా ఉండాలని పేర్కొంది. కుదిరితే పాక్షిక కర్ఫ్యూ, లేదంటే పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది

రష్యాలో కొత్త రకం వ్యాధి...

బర్డ్‌ఫ్లూలో ‘హెచ్‌5ఎన్‌8’ అనే కొత్త రకం మానవుల్లోకి వ్యాపించింది. ప్రపంచంలో తొలిసారిగా రష్యాలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇది పక్షుల నుంచి పాకింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలియజేసినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. గత కొద్దినెలల్లో హెచ్‌5ఎన్‌8 రకం రష్యా, ఐరోపా, చైనా, పశ్చిమాసియాలోని కోళ్ల పరిశ్రమలో విజృంభిస్తోంది. మానవుల్లో కనిపించలేదు. ఇతర రకాలైన హెచ్‌5ఎన్‌1, హెచ్‌7ఎన్‌9, హెచ్‌9ఎన్‌2 ఇప్పటికే మనుషుల్లోకి పాకాయి. ఇప్పుడు హెచ్‌5ఎన్‌8 కూడా ఈ కోవలోకి చేరినట్లు వెల్లడైంది. రష్యాలోని ఒక పౌల్ట్రీ కేంద్రంలో ఏడుగురు కార్మికులకు ఇది సోకిందని అధికారులు తెలిపారు. అయితే బాధితుల పరిస్థితి బాగానే ఉందన్నారు. వ్యాధి సోకిన లేదా చనిపోయిన పక్షులను తాకడం వల్ల మానవుల్లోకి బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. చికెన్‌ను సరిగా వండి, తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: