కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి కొత్తపల్లి..

పద్మ కన్నుమూత

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సీనియర్ కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి కొత్తపల్లి  పద్మ హైదరాబాద్ లో కనుమూశారు!  కొంతకాలంగా ఆమె పక్షవాతానికి  గురై అనారోగ్యం తో చికిత్స పొందుతున్నారు!  డాక్టర్ వెంపటి చినసత్యం దగ్గర 18 ఏళ్ల పాటు శిష్యరికం చేశారు!  తెనాలికి  చెందిన పద్మ హైదరాబాద్ లో స్థిరపడి  శ్రీనృత్యాలయ నాట్య సంస్థను ప్రారంభించి ఎందరో శిష్య ప్రశిష్యులను తీర్చి దిద్దారు ! తన ఐదవ ఏటనే నృత్యం పై మక్కువ పెంచుకున్నారు!  టెన్త్ పూర్తీ కాగానే, విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో  నాట్యం లో డిప్లొమా పూర్తీ చేశారు!  1962 లో మద్రాస్ వెళ్లి పద్మభూషణ్ వెంపటి చిన సత్య నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీ లో శిష్యురాలిగా చేరారు! మద్రాస్ లో జరిగిన ఆమె కూచిపూడి నాట్య అరంగేట్రానికి  నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విచ్చేసిన విషయాన్నీ ఆమె ఎప్పుడూ గుర్తు చేస్తుండే వారు!  శృంగారమణి, నాట్య మయూరి లాంటి బిరుదులూ పొందారు!  ఆ రోజుల్లోనే కేంద్రం నుంచి స్కాలర్షిప్, ప్రశంసలు అందుకున్న గొప్ప నర్తకి గా గుర్తింపు పొందారు.  ఐదు రోజుల క్రితమే ఆమె కుమారుడు కిరణ్ గుండెపోటు తో చనిపోయారు!  ఆ దిగులు, అనారోగ్యపు  ఇబ్బందులు పద్మని మరింత కుంగదీసాయి! కూచిపూడి ఆణిముత్యం పద్మ లేని లోటు తీరనిది!  వారికి నివాళి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: