పోతలపాడు గ్రామవాసి గాయం. వెంకట్ రెడ్డికి

కర్పగం యూనివర్సిటీ డాక్టరేట్


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

        తర్లుపాడు మండలం పోతలపాడు గ్రామవాసి గాయం. వెంకట్ రెడ్డి కి తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ లోని కర్పగం యూనివర్సిటీ ద్వారా శుక్రవారం నాడు డాక్టరేట్ ప్రధానం చేశారు. మలేరియా మరియు క్యాన్సర్ ను కట్టడి చేసే ఫ్లోరో క్వీన్, ఫినోలీన్ కాంపౌండ్  ఫార్ములను కనుగొన్నందుకు గాను డాక్టరేట్ ను పొందారు. కర్పగం యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్. వసంత కుమార్, యూనివర్సిటీ సీఈవో, మురుగయ్య, ఏబీవీపీ నేషనల్ జాయింట్ ఆర్గనైజర్ సెక్రెటరీ జి. లక్ష్మణ్ జి  సంయుక్తంగా  డాక్టరేట్ ప్రధానం చేశారు. 

         ఈ పరిశోధనలో మార్గదర్శకులుగా ఆ యూనివర్సిటీకి చెందిన డాక్టర్. రవి సుబ్బన్, తంగనా నీజీ నీ తోడ్పాటు అందించారని వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ డాక్టరేట్ వచ్చినందుకు వాళ్ల ఇరువురికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ పొందిన వెంకట్ రెడ్డి ని  విజ్ఞాన స్కూలు కరస్పాండెంట్ గాయం. లక్ష్మి రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, మిత్రులు శ్రేయోభిలాషులు, అభినందించారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: