ప్రశ్నించే గొంతులను గెలిపించండి

నగర అభివృద్ధి కాంగ్రెస్ తోనే   సాధ్యం

జె లక్ష్మీ నరసింహ యాదవ్,  నంద్యాల   పార్లమెంట్ జిల్లా  కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మున్సిపల్ ఎన్నికల సందర్బంగా నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా  నంద్యాల పార్లమెంట్ జిల్లా  కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ దేశంలోనూ,  రాష్ట్రంలోనూ ప్రశ్నించే గొంతులు లేకపోవడం వల్ల అధికార పార్టీ  నాయకులు పేద ప్రజల జీవితాలను చిన్నా భిన్నం చేస్తూ వారి జీవితాలతో ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చినట్టుగా  గ్యాస్ ధర వెయ్యికి, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ కొట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరకు నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలు వచ్చినట్లుగా    సామాన్య ప్రజలు ఏమీ కొనేటట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఇటువంటి మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాకిన రైతు ఉద్యమాలను లెక్కచేయకుండా ఎనభై రోజుల నుంచి చేస్తున్న ఉద్యమాలను పట్టించుకోకుండా మోడీ కళ్లు ఉండి కూడా చూడలేని కబోదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పిచ్చి తుగ్లక్ పాలనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లొ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జైకొడుతూ మద్దతు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్ , పవన్ అనే విషయం ప్రజలందరికీ తెలుసని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ, టిడిపి,  జనసేన ఏ ఒక్కరికి ఓటు వేసిన బిజెపికి ఓటు వేసినట్లేనని గుర్తుచేశారు. కేంద్రంలో బిజెపి పార్టీ పాలనను తలదన్నేలా రాష్ట్రంలో అంతకుమించి అరాచక పాలన వైస్సార్సీపీ పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం పూర్తిగా అమలు కాక అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు.  ఎన్నికల ముందు పాదయాత్రలో సోనా మసూరి సన్నబియ్యం ఇస్తామని చెప్పి  నేడు స్వర్ణ రకం మధ్యస్థ బియ్యం పేరుతో పంపిణీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డోర్ డెలివరీ కూడా పూర్తిగా విఫలమైందని ఎనభై శాతం ప్రజలు డోర్ డెలివరీ వద్దు మేమే తెచ్చుకుంటాం అన్నట్లుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నానని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇటువంటి అతిముఖ్యమైన పథకం ఫీజు రీయంబర్స్మెంట్ పథకమని  నేడు తనయుడు తండ్రి బాటలో నడుస్తానని చెప్పి ఫీజు రీయంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ జీవో నెంబర్  77   ను తీసుకువచ్చి పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలకు  పీజీ విద్యను దూరం చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిదే అని ఎద్దేవా చేశారు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూలీ పని చేసుకునే ప్రజల పిల్లలందరూ ఉన్నతవిద్యను చదివితే  నేడు డిగ్రీ అయిపోయాక పీజీ చదవాల్సిన   విద్యార్థులందరూ కూలి పనులు చేస్తున్నారని తెలిపారు.  ప్రజలందరూ గమనించి నగరం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో దేశంలో అరాచక పాలనను ప్రశ్నించాలన్న ప్రశ్నించే గొంతులకు ఓటు వేసి గెలిపించాలని  తెలిపారు .పిసిసి అధికార ప్రతినిధి వాసు ,  కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫరూక్ మాట్లాడుతూ  నగర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు  కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు  

వార్డు నెంబర్        పేరు  

 01          రవికుమార్  

 02          షబ్బీర్ 

 03          మెహబూబ్ 

 07           షేక్ అబ్దుల్లా  

 11            కాశి౦

 15           శిలం రత్నమ్మ  

 18            బాలకృష్ణ  

 28           దాసరి చింతలయ్య

 30            షేక్ ఆషాభాను  

 35            మహమ్మద్ రఫీ  

 36            బి సరలమ్మ  

 39             సంపంగి శ్రావణి  

అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ  మైనార్టీ  అధ్యక్షుడు  పఠాన్ హబీబ్ ఖాన్ . జిల్లా కార్యదర్శి ఇస్మాయిల్  , జిల్లా మైనార్టీ సెల్ పట్టణ నాయకులు అబ్దుల్ రజాక్  ,  జిల్లా సహాయ కార్యదర్శి ఉసేన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా నాయకులు రామకృష్ణ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీసీ ప్రసాద్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ కౌన్సిలర్  సల్మాన్,   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహమాన్  సీనియర్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అహ్మద్ బాషా  తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: