పోలీసులకు  కరోనా వైరస్ నివారణకై టీకాలు  

 వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ 

 (జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

మండల కేంద్రమైన తుగ్గలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారము పత్తికొండ హెడ్ కానిస్టేబుల్ రంగస్వామి కి మరియు పోలీసులకు కరోనా వైరస్ నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, అంగనవాడి ,రెవెన్యూ ఉద్యోగులకు, టీకాలు వేయడం జరిగిందని, ప్రస్తుతం పోలీసులకు టీకాలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కరోనా వైరస్ నివారణ కై టీకాలు వేయించుకున్న వారంతా క్షేమంగా ఉన్నారని ఎలాంటి  సైడ్ ఎఫెక్టులు లేవని ఆయన తెలిపారు .అందువల్ల నిర్భయంగా వచ్చి సంబంధిత ఉద్యోగులు టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మోహన్, స్టాఫ్ నర్స్ రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: