ప్రజా సేవకై ప్రజల్లోకి....ఖండే శ్యాం సుందర్ లాల్

పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు

మున్సిపల్ ఎన్నికల క్షేత్రంలోకి.. సీనియర్ పాత్రికేయుడు శ్యాం సుందర్ లాల్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖండే శ్యాం సుందర్ లాల్  బుధవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  నంద్యాల మున్సిపాలిటీలోని 12వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖండే శ్యాం సుందర్ లాల్ బాలాజీ కాంప్లెక్స్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరుతూ ప్రచారం సాగింది. వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

వార్డు ప్రజలకు సుపరిచితుడు కావడంతో వార్డు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలికారు. పెద్దలను గౌరవప్రదంగా... తన తోటి వారిని ప్రతి ఒక్కరినీ  పేరు పేరునా పలకరిస్తూ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం సాగించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా  పలకరిస్తూ ప్రచారంతో నిండుతనం కనిపించింది. ఎవరికి ఏ సహాయం కావాలన్న...ఏ ఆపద వచ్చినా... సమస్య ఏదైనా నేనున్నాను అంటూ అందరికి పలికే వ్యక్తి కావడంతో వార్డు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో తప్పక బలపరుస్తామన్న  హామీలను వార్డు ప్రజల నుంచి పొందుతూ ముందుకు కదిలిన ఆయనకు ప్రచారంలో మంచి స్పందన కనిపించింది. ఆయన వెంట వార్డు పెద్దలు,  మహిళలు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి  

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: