సాధారణ జీవితం...

ఆయన వ్యక్తిత్వానికి మణిహారం

బహుముఖ మేధావి పద్మ అవార్డు గ్రహీత- అలీ మణిక్‌ఫాన్ 

అలీ మణిక్‌ఫాన్ 

గల్లిస్థాయిలో చిన్నపాటి సత్కారానికే ఎవరికైనా కొమ్ములొచ్చే రోజులివి. ఏకంగా పద్మ అవార్డు వరించినా ఆయనలో మార్పు రాలేదు. గతంలో మాధిరిగానే సాధారణ జనంలో కలసిమెలసి జీవిస్తున్న బహుముఖ మేధావి ఆయన. ఆయనో ఎవరో తెలుసా...? కోజికోడ్‌లోని ఒలవన్న ప్రాంత స్థానికులు ప్రతిరోజు సాయంకాలం అరేబియా దుస్తులు ధరించిన సన్నగా నిటారుగా, ఉన్న వ్యక్తి తన ఇంటి వైపు నడుస్తూ ఉండటం గమనించేవారు. వారికి  అతను ఇక్కడ నివసిస్తున్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఎఫ్ఆర్ఐ) నుండి రిటైర్డ్ అధికారి అని, లక్షద్వీప్ నుండి వచ్చాడని మాత్రమే తెలుసు. అతని పేరు అలీ మణిక్‌ఫాన్ అని మాత్రమే తెలుసు. కానీ టెలివిజన్ లో పద్మ అవార్డు గ్రహీతలలో అలీ మణిక్‌ఫాన్ పేరును వినపుడు అక్కడి   స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒలవన్నలోని స్థానిక ప్రజానికానికి అతనికి పద్మశ్రీ లభించినట్లు వార్తలు వెలువడే వరకు నిజానికి అతను ఎవరో తెలియదు. ”

ప్రస్తుతం ఒలవన్నలో తన భార్యతో పాటు అద్దె వసతి గృహంలో నివసిస్తున్న మినికోయ్‌ వాసి. మణిక్‌ఫాన్‌ను కేరళలోని కన్నూర్‌కు చదువు కోసం పంపారు, కాని ఐదవ తరగతి తరువాత అతను ఫార్మల్ విద్యను అభ్యసించలేదు. లక్ష్వదీప్ దీవులలోని తన స్వస్థలమైన మినికోయ్‌కు తిరిగి వచ్చాడు. మణిక్‌ఫాన్‌ గొప్ప పరిశీలకుడు, అతనికి మినికోయ్ ద్వీపాలకు దూరంగా సముద్రంలో నివసించే ప్రతి చేప గురించి  తెలుసు. ఈ పరిశీలనతత్వమే అతనికి చేపల పట్ల మక్కువగా మారింది. ఇదే మక్కువ చేపలు, వాటి మూలం, వాటి గురించి మరింత అధ్యయనం చేయడానికి అతన్ని ప్రేరేపించింది.

అలా ఆయన చేపల పరిశోధన ఆయనకి CMFRI లో ఉద్యోగం సంపాదించి పెట్టింది, అక్కడ మణిక్ ఫాన్ అరుదైన చేపను కనుగొన్నాడు. దానికి అతని పేరు పెట్టబడింది - అబూడెఫ్దుఫ్ మణిక్‌ఫని Abudefduf Manikfani. మణిక్‌ఫాన్ ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్, అరబిక్, ఇతర భాషలతో సహా 14 భాషలను మాట్లాడగలడు, చదవగలడు, వ్రాయగలడు. వాటిలో ఆయన ఏడు భాషలను కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తాడు.

1981 లో, ఓమన్‌ కు   సిన్బాద్, నావికుడు Sinbad the Sailor వాడిన నౌకను పున;నిర్మించడానికి ఐరిష్ నావికుడు టిమ్ సిర్వెన్  Tim Sirven ఈయనని ఆహ్వానించారు. లోహాలు లేకుండా నౌకను తయారు చేయాలని ఆయనన్ని ఆహ్వానించారు. అలీ, అతని బృందం ఒక సంవత్సర కాలం లో 27 మీటర్ల పొడవైన ఓడను కలప, కాయిర్ ఉపయోగించి తయారు చేశారు. ఒమన్ లోని సోహర్ పట్టణం పేరుమీద డానికి “సోహర్” అని పేరు పెట్టారు. అలా తయారైన ఓడలో ఆయన, ఆయన బృందం దానిపై ఒమన్ నుండి చైనాకు 9,000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పుడు దానిని ఒమన్ లోని ఒక మ్యూజియంలో ఉంచారు. మణిక్‌ఫాన్ యొక్క మరో ప్రధాన ఆసక్తి లూనార్/చంద్ర క్యాలెండర్. అతను న్యూ మూన్ New moon, ఖగోళ అల్గోరిథంల ఆధారంగా ఒక నూతన క్యాలెండర్‌ను నిర్మించారు.

బహుముఖ ప్రతిభ /వ్యక్తిత్వం గల  మణిక్‌ఫాన్ రోలర్ మోటారుతో ఒక సైకిల్‌ను కనుగొని తన కుమారుడు మూసాతో కలిసి న్యూ ఢిల్లీ కి ప్రయాణించారు. మణిక్‌ఫాన్ ఆసక్తిలో మరొకటి వ్యవసాయం. అతను తమిళనాడులోని తిరునెల్వేలి వద్ద బంజరు 15 ఎకరాల భూమిని స్వదేశీ సాగు పద్ధతులను ఉపయోగించి పచ్చని వ్యవసాయ భూమిగా మార్చాడు. సాంప్రదాయ పదార్థాలను ఉపయోగించి నివాస ప్రాంగణాన్ని కూడా నిర్మించాడు. మణిక్‌ఫాన్ ఇప్పుడు పద్మశ్రీ అవార్డు యొక్క కీర్తిని పొందారు. కాని ఈ గౌరవం తరువాత కూడా ఆయన వైఖరిలో తేడా లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. గొప్ప వ్యక్తిత్వం గల మణిక్‌ఫాన్ ను సత్కరించడానికి కోజికోడ్ లోని ఒలవన్న ప్రాంత స్థానిక ప్రజలు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ”

✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ 

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: