పువ్వాడ నాగేశ్వర రావు నెక్లెస్ రోడ్డు" గా నామకరణం చేయాలి.!

ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం జిల్లా ప్రతినిధి)

          ఖమ్మం జిల్లా అభివృద్ధి కాముకుడు, నాటి ఖమ్మం ఎమ్మెల్యే అయిన పువ్వాడ నాగేశ్వరావు గారి కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న లకారం - శ్రీ శ్రీ సర్కిల్ రోడ్డుకు "పువ్వాడ నాగేశ్వరరావు నెక్లెస్ రోడ్డు" గా నామకరణం చేయాలని ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రధ సప్తమి సందర్భంగా ఖమ్మం స్టేషన్ రోడ్ లోని పౌర సమితి కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పౌర సమితి వ్యవస్థాపకుడైన పువ్వాడ నాగేశ్వర రావు గారు ఆ రోజున పౌర సమితి కోరిక మేరకు ఇందిరా నగర్ రోడ్డు వద్ద నుంచి అటు అల్లీపురం క్రాస్ రోడ్ వరకు ఇటు లకారం చెరువు నుంచి శ్రీ శ్రీ సర్కిల్ వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మించారని తెలిపారు. రూ. 5 లక్షల ఎమ్మెల్యే నిధులతో నాడు ఈ అపూర్వ అభివృద్ధి  కార్యక్రమానికి నాంది పలికారని గుర్తు చేశారు. అలాగే రైతాంగ సమస్యను తీర్చేందుకు తన నాలుగు నెలల వేతనాన్ని అంటే  లక్ష రూపాయలను వెచ్చించి ఎన్నెస్పీ  పైప్ లైన్ నిర్మించినట్లు తెలిపారు.
నేడు ఖమ్మం నగరంలో అభివృద్ధికి మూల కేంద్రం గా, విస్తరణకు చిరునామాగా చెప్పుకుంటున్న ఈ రోడ్డు పురోభివృద్ధికి నాడు ఎమ్మెల్యే గా ఉన్న పువ్వాడ నాగేశ్వరావు గారే బీజం వేశారని పేర్కొన్నారు. 1992 లోనే నాడు చారిత్రక నేపథ్యం కలిగిన లకారం చెరువు కట్ట నిర్మాణానికి పువ్వాడ నాగేశ్వరరావు గారు రూ.32 లక్షల నిధులను వెచ్చించి అభివృద్ధి పరిచినట్లు వివరించారు. నేడు తండ్రి అభివృద్ధి కాంక్షను నెరవేరుస్తూ తనయుడు పువ్వాడ అజయ్ కుమార్ గారు లకారం టాంక్ బండ్ ను కోట్ల నిధులతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక పదవులకు వన్నె తెచ్చి జిల్లాలో ఒక రాజకీయ మేధావిగా కీర్తించబడుతున్న పువ్వాడ నాగేశ్వరరావు గారి కృషి కి గుర్తుగా ఈ రెండు రోడ్ల ప్రాంతాన్ని "శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు నెక్లెస్ రోడ్డు" అని నామకరణం చేయడం సముచితమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమ్మం పౌర సమితి సభ్యులందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాడ అజయ్ కుమార్ తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కు పంపించడం జరుగుతుందని పులిపాటి పేర్కొన్నారు. అలాగే రూ. 10 కోట్ల అభివృద్ధి నిధులతో లకారం నుంచి శ్రీ శ్రీ శ్రీ సర్కిల్ వరకు, కళానికేతన్ నుంచి అల్లీపురం రోడ్ వరకు అభివృద్ధి పునాదులను మరింత పటిష్టపరచిన మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి సమావేశం కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేసింది.
ఈ సమావేశంలో ఖమ్మం పౌర సమితి కో ఆర్డినేటర్లు ఎస్.కె ఖాసిమ్, వి.వి.అప్పారావు, గోళ్ల రాధాకృష్ణ, ప్రతాపనేని నరసింహారావు, ఎండి రియాసత్, సతీష్ చౌదరి, కొత్త వెంకటేశ్వరరావు, సిద్ధంశెట్టి శ్రీకాంత్, వి వి సుబ్బారావు, గుమ్మడవెల్లి శ్రీనివాస్, వరప్రసాద్, కీసర పద్మజా రెడ్డి, పోలా హరినాథ్, ఆకుల సతీష్, కందిమల్ల బిక్షమయ్య, రాయపూడి రమేష్, కొదుమురి మోహన్ రావు, కోలా రామారావు, బూర్ల లక్ష్మీనారాయణ, వెంపటి నాయుడు, జి. వసంత్, పోతుగంటి వెంకటేశ్వర్లు, సతీష్, కుర్ర శ్రీనివాస్, లక్ష్మీ నరసింహారావు, డోకుపర్తి సుబ్బారావు, అవోపా కృష్ణమూర్తి, జహీర్, చక్రవర్తి, పగిడిపల్లి రాజారావు, కొదుమూరి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: