సంచలన రచయిత 

చిన్నికృష్ణ చేతుల మీదుగా

"డాన్స్ రాజా డాన్స్" ట్రైలర్ రిలీజ్!

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     నృత్య సంచలనం ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ (నిరోష), మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య తారాగణంగా.. వెంకీ ఏ.ఎల్ దర్శకత్వంలో రూపొంది డాన్సులతో ఉర్రూతలూగించిన ఓ చిత్రం "డాన్స్ రాజా డాన్స్"గా  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

    ఈ చిత్రం ట్రైలర్ ను సంచలన రచయిత చిన్నికృష్ణ ఆవిష్కరించారు. నృత్య ప్రధానంగా రూపొందిన "డాన్స్ రాజా డాన్స్" తెలుగులోనూ ఘన విజయం సాధించాలని ఆయన అభిలషించారు. భారతీబాబు మాటలు-పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ ప్రముఖ సంగీత దర్శకురాలు-గాయని ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం.

     'నరసింహనాయుడు, ఇంద్ర' వంటి సంచలన చిత్రాల రచయిత చిన్నికృష్ణ చేతుల మీదుగా 'డాన్స్ రాజా డాన్స్' ట్రైలర్ లాంచ్ కావడం ఆనందంగా ఉందన్నారు తుమ్మలపల్లి. కార్యక్రమంలో ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు!!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: