ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళం విప్పాలి

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో ఎంపీలు విఫలం 

డీసీసీ అధ్యక్షులు జె లక్ష్మి నరసింహ యాదవ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనార్టీ సోదరులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళం విప్పాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో ఎంపీలు విఫలమయ్యారని నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జె. లక్ష్మి నరసింహ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక  పద్మావతి నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, మైనారిటీ నాయకులు  ఫారూక్ సమక్షంలో నంద్యాల కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నంద్యాల నుండి అబ్దుల్ రజాక్, అమీర్ బాషా, ముల్లా అమీర్ తో పాటు మరో ఇరవై మంది ముస్లిం సోదరులు  కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ   కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల కృషి చేయాలని, 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టులు దర్శనమిస్తున్నాయని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన ఎంపీలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించడం కోసం రాష్ట్ర ఎంపీలు మాట్లాడాలని  పిలుపునిచ్చారు.
వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని గుర్తుచేశారు.  అదే విధంగా మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. బీజేపీ పార్టీ అధికారం లేని చోట అధికారం కోసం కుల మత కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తోందని,  కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ గుళ్లు,  గోపురాల మీద దాడి జరగలేదని,  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ మతఘర్షణలు లేవని గుర్తుచేశారు. దేవుడి పేరు మీద మత ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం పిసిసి అధికార ప్రతినిధి వాసు, నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, మైనార్టీ నాయకులు ఫరూక్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు  పఠాన్ హబీబ్ఖాన్ లు  మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీకి సంబంధించి ముస్లిం సోదరులకు మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇతర పార్టీలు ఏవైనా ముస్లిం సోదరులకు నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా,  జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహమాన్,  సీనియర్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అహ్మద్ బాషా  తదితరులు పాల్గొన్నారు

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: