న్యాయ వాద దంపతుల హత్య కు నిరసనల వెల్లువ

అడ్డుకున్న పోలీసులు, న్యాయ వాదుల అరెస్టు

హత్యను ఖండించిన నాంపల్లి కోర్టు న్యాయ వాదులు

రాజ్ భవన్ ముట్టడి కి యత్నం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైకోర్టు న్యాయ వాది గట్టు వామణ్ రావు దంపతుల హత్య కు నిరసనగా తెలంగాణలోని అన్నీ కోర్టుల విధులను నిలిపివేసి, హత్యను తీవ్రంగా ఖండించారు. అనంతరం రాజ్ భవన్ ముట్టడి కి బయలుదేరిన నాంపల్లి కోర్టు న్యాయ వాదులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. "" న్యాయ వాదుల ఐక్యత వర్ధిల్లాలి"", న్యాయ వాదులకు రక్షణ కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని ఎర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఎన్కౌంటర్ చేయాలని హెచ్చరించారు. ఈ హత్య హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా శిక్షించే విధంగా సెక్షన్ల ను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బార్ కౌన్సిల్ సభ్యులు బి. కొండారెడ్డి మాట్లాడుతూ హైకోర్టు న్యాయ వాద దంపతుల హత్య ను ఖండించారు.


ఆందోళన చేస్తున్న న్యాయవాదులు


మీడియాతో మాట్లాడుతున్న నాంపల్లి క్రమినల్ కోర్టు
 ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్...

మీడియాతో మాట్లాడుతున్న బార్ కౌన్సిల్ సభ్యులు బి.కొండారెడ్డి మాట్లాడుతూ 

ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అలసత్వం చేయరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీసులే ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. మహిళా న్యాయ వాది టి.సురేఖ మాట్లాడుతూ రామగుండం పోలీసు కమీషనర్ సత్యనారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. "" గో బ్యాక్ పోలీస్ "" అంటూ నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు ఆమెను సైతం అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో నాంపల్లి క్రిమినల్ కోర్టు మాజీ అధ్యక్షులు ఎల్. ప్రభాకర్ రెడ్డి, రాములు, మిశ్రా, వేణుగోపాల్, నవీన్ సౌధ, కరికె మల్లేష్, గణేష్, రాజ్ గోపాల్ లడ్డ, జి.వెంకటేష్, నాగేందర్, జస్పాల్ సింగ్, అనంతుల పద్మావతి, లక్ష్మణ్ గంగ తదితరులను పోలీసులు స్టేషన్లో ఉంచారు. 


 

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్.హైద్రాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: