ఇసుక కొరత సమస్యను పరిష్కరించండి

కార్మికులకు ఉపాధి కల్పించండి

ఆర్డీఓకు ఏఐటియూసీ వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఇసుక సమస్యను పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరికేలా చేయాలని ఆర్డీఓకు ఏఐటియూ నేతలు వినతిపత్రం అందజేశారు. సోమవారంనాడు అందె. నాసరయ్య  ఆధ్వర్యంలో సెంట్రింగ్ కార్మికులు పూల సుబ్బయ్య భవన్ నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు వెళ్లి ఆర్డీవో శేషి రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు ఇసుక కొరత మార్కాపురం పట్టణంలో ఎక్కువగా ఉన్నది భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది, ఇలాగే పలు విభాగాలలో పనిచేసే కార్మికుల పలు సమస్యలను వివరించారు.

 అందె. నాసరయ్య

ఆర్డివో శేషిరెడ్డి మాట్లాడుతూ ఇసుక కొరత తీర్చడానికి మైనింగ్ ఆఫీసర్ తో మాట్లాడతానన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నాయకులు అందే నాసరయ్య షేక్ ఖాసిం ఏ ఐ టి సి జిల్లా కార్యదర్శి చిన్న జగన్మోహన్ రెడ్డి షేక్ మొహమ్మద్ సుబ్బారెడ్డి వై భాస్కర్ రెడ్డి శేఖర్ ఇన్ షేక్ కరీం డి ఖాసిమ్ అలీ మొదలగు వారు పాల్గొన్నారు.  

✍️రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: