రక్తదానం చేస్తాం... ప్రాణదాతలుగా మారుదాం 

రక్తదానం చేస్తాం కుల మతాల అడ్డు గోడల్ని కూలుద్దాం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రక్తదాన కేంద్రంలో తలసీమియా వ్యాధిగ్రస్తురాలు సాయి చైతన్య అనే బాలికకు అత్యవసరంగా బీ పాజిటివ్ రక్తం అవసరమై ఇబ్బంది పడుతుంటే ఆదుకొన్నారు రక్త దాతలు. రక్తం అవసరం అన్న విషయాన్ని   టిప్పు సుల్తాన్ మానవతా రక్తదానం సభ్యులు  ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు  తెలుపగా ఆయన కలగజేసుకొని బాధితులను ఆదుకొన్నారు.
మైనార్టీ నాయకులు జహూర్ బీపాజిటివ్ రక్తదానం చేశారు టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అనునిత్యం అత్యవసర సమయాల్లో అన్ని వేళలా శస్త్ర చికిత్సలకు డెలివరీ కేసులకు ప్రాధాన్యత నిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావం పెంపొందించే ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఉమర్ ఫారూఖ్ ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ రక్త దాన సంఘం సభ్యులు.నాజిమ్.నస్రుల్లా.తదితరులు పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: