'మహదేవపురం'లో ఏం జరిగింది...?

(సముద్రాల ప్రవీణ్-జానోజాగో వెబ్ న్యూస్)

 ఇంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు-రమ్యకృష్ణ జంటగా 'అంజనీపుత్రుడు' చిత్రాన్ని రూపొందించిన బహుముఖ ప్రతిభాశాలి కె.చంద్రశేఖర్ తాజాగా.. స్వీయ నిర్మాణం-రచన- దర్శకత్వంలో తనే హీరోగా నటిస్తూ లక్కీ ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం 'మహదేవపురం'. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమిస్తూ... సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.సూర్యనారాయణ సహ నిర్మాత. ప్రీతి సింగ్, ప్రమీల, అర్జునరాజు, సూర్యనారాయణ, బ్రహ్మం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం "ఊర్వశి ఓటిటి" ద్వారా విడుదల కానుంది.
హీరో-రైటర్-ప్రొడ్యూసర్-డైరెక్టర్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ... "కథ, స్క్రీన్ ప్లే, పాటలు, పోరాటాలు, నేపధ్య సంగీతం, గ్రాఫిక్స్ "మహదేవపురం" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు" అని అన్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: రవి, కెమెరా: గోపి, ఎడిటింగ్: మేనగ శ్రీను-ఉదయ్ కుమార్, పాటలు: రాందాసు టంగుటూరి, సంగీతం: మహేష్ నారాయణ, సహ నిర్మాత: కె.వి.సూర్యనారాయణ, హీరో-రైటర్- ప్రొడ్యూసర్-డైరెక్టర్: కె.చంద్రశేఖర్.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: