మంచు విష్ణు 'మోసగాళ్లు'...

రెండో పాటకు అద్భుతమైన స్పందన

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'మోస‌గాళ్లు'. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుదలవుతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ అండ్ ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేసారు నిర్మాత, హీరో మంచు విష్ణు. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు, టీజ‌ర్ల‌కు సూప‌ర్బ్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలోని 'సంపాదించాలంటే...' ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా విడుదల చేసిన 'డబ్బే మనది కుమ్మేస్కో... మస్తీ మస్తీ చేసేస్కో... కాస్ట్లీ మందే వేసేస్కో...' లిరికల్ వీడియోకు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సామ్ సీఎస్ స్వరపరిచిన ఈ పాటకు లిరిసిస్ట్ సిరాశ్రీ సాహిత్యం అందించారు. సింగర్ హేమచంద్ర తనదైన శైలిలో ఈ పాటను ఆలపించి మెప్పించారు.చ‌రిత్ర‌లో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న 'మోస‌గాళ్లు' చిత్రానికి లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. 51కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 'మోసగాళ్లు' చిత్రాన్ని డా.మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో విడుదలకానుంది. 

తారాగ‌ణం:

విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రుహీ సింగ్‌ తదితరులు

సాంకేతిక బృందం:

ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌

నిర్మాత‌: విష్ణు మంచు

బ్యాన‌ర్‌: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్

సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: