గ్రామ,వార్డు వాలెంటర్లను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలి

ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు వాలేంట్రీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు 16 వేలు జీతం ఇవ్వాలని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగరాముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగరాముడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలేంట్రీ వ్యవస్థను ప్రవేశపెట్టి రాష్ట్రంలో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని సంకలు గుడ్డుకుంటుంది తప్ప వాలేంట్రీలకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా వాలేంట్రీల జీవితాలను నీటిమీద బుడగలాగా తయారు చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు.
వాలేంట్రీ వ్యవస్థ పేరుతో వాలేంట్రీలను నానా వెట్టిచాకిరి చేయిస్తూ, వారికి కనీస జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వాలేంట్రీలను తమ స్వార్దనికి వాడుకుంటున్నారని వారు తెలిపారు. మాకు జీతాలు చాలడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని జిల్లాల్లో వాలేంట్రీలు ఆందోళనలకు దిగడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాలేంట్రీలపై ఎంత వరకు అనుకూలంగా ఉన్నదో అందరికి అర్థమవుతున్నదని వారన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాలేంట్రీలకు ఉద్యోగ భద్రత కల్పించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు 16 వేలు ఇవ్వాలని ఎఐవైఎఫ్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలోఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాలేంట్రీలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ నంద్యాల పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, విష్ణు నాయకులు చైతన్య, రమణ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: