కటారుకొండ గ్రామ పంచాయతీ సీపీఐ అభ్యర్థి..

నక్కి లెనిన్ బాబు విజయం

(జానోజాగో వెబ్ న్యూస్-డోన్ ప్రతినిధి)

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం కటారుకొండ గ్రామ పంచాయతీ సీపీఐ అభ్యర్థి, ఏఐవైఎఫ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు 264 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆయన్ని పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ఇదిలావుంటే డోన్ నియోజకవర్గం కటారుకొండ పోరాటాల పురిటీగడ్డగా పేరొందింది. అలాంటి చోట నక్కి లెనిన్ బాబు గెలుపుతో ఎర్రజెండా విజయభావుట సీపీణ శ్రేణులలో నూతనోత్సాహం నింపుతోంది.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: