గౌరవవేతనం కాదు కనీస వేతనం చెల్లించాలి

ఇది వాలంటీర్ల డిమాండ్ !! 

పీవైఎల్ నేత నవీన్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి) 

నందికొట్కూరు పట్టణంలో స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ముఖ్యుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి యూ.నవీన్ కుమార్  మాట్లాడుతూ వాలంటీర్స్ అందరకూ కనీస వేతనం 12 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగావాలంటీర్లు తమపై రాజకీయ వేధింపులు ఆపాలని ,తమ జీతాలు పెంచాలని, సుప్రీం తీర్పు ప్రకారం కనీస వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టే ముందు తనదైన శైలిలో గడప వద్దకే పాలన ప్రతి రెండు వేల మంది జనాభాకు గ్రామ సచివాలయం 2.7 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ ల నియామకం, 1.36 లక్షల శాశ్వత ఉద్యోగుల నియామకంచేపడతానని మ్యానిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు యూ.నవీన్ కుమార్ పేర్కొన్నారు.  బియ్యం, పెన్షన్ ,ఆరోగ్యశ్రీ కార్డులు, కుల ,ఆదాయ, ధ్రువీకరణ పత్రాలతో సహా 541 సేవలు నిర్దిష్ట కాలవ్యవధిలో అందుబాటులో ఉంటాయని,50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులు నెలకు ఐదు వేలు గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్స్ నియమిస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.వాలంటీర్ల నియామకం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొంతమేరకు ఉపయోగపడిందని యూ.నవీన్ కుమార్ అన్నారు. వాలంటీర్ల సేవలను బట్టి వారికి మరో మూడు వేల రూపాయలు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడంతో వారిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. వాలంటీర్లుగా అధికార పార్టీ వారినే నియమించారని ప్రతిపక్షం ఆరోపించినా రిక్రూట్మెంట్లో అందరికీ అవకాశం రావడంతో ఆ విమర్శ కొట్టుకుపోయిందన్నారు.కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిలా ప్రభుత్వ పథకాలు నవరత్నాలు అందించి, ప్రాణాలు సైతం లెక్క చేయకుండాపని చేసిన వాలంటీర్లకు  ఇచ్చే వేతనాలు వారికి ఏ మాత్రం కనీస అవసరాలు కూడాతీర్చడంలేదు,రోజుకిసగటున167రూపాయలు వేతనానికి పనిచేయవలసి వస్తోంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే విధంగా కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.   ఉద్యోగ భద్రత కల్పించాలని, జాబ్ చార్టు ప్రకటించాలని,  ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , వారుచేస్తున్న డిమాండ్ న్యాయమైనదేనని వారి పోరాటానికి ప్రగతిశీల యువజన సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు నవీన్  తెలిపారు.ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు అఖిల్, మధు, పీడీఎస్ యూ నాయకులు నాగేంద్ర, విజయ్ పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: