న్యాయవాదులకు రక్షణ కల్పించేలా చట్టం చేయాలి

తెలంగాణ బార్ కౌన్సిల్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

న్యాయ వాదుల రక్షణ కల్పించేందుకు చట్టం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యాయవాదులకే రక్షణ కరువైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటీ అని ప్రశ్నించింది. న్యాయవాదులకు రక్షణలేనపుడు ఇక న్యాయవ్యవస్థ ప్రామదంలో పడ్డట్లేనని పేర్కొంది. అదే సందర్భంలో సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదముందని ప్రకటించింది. కావున న్యాయవాదులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని  తెలంగాణ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్. హైద్రాబాద్ 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: