నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులుగా..

మొరిగాడి ఉపేందర్ గౌడ్

(జానోజాగో వెబ్ న్యూస్ - హైదరాబాద్ బ్యూరో )

నిరంతరం ప్రజా సమస్యలపై ముందుండి పోరాడే వ్యక్తి, విద్యావేత్త, సౌమ్యశీలి మొరిగాడి ఉపేందర్ గౌడ్ నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉడుతల బాలకృష్ణ గౌడ్  ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులుగా నియమితులైన మొరిగాడి ఉపేందర్ గౌడ్ ది  స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు. మొరిగాడి యాదగిరి గౌడ్-రాజమ్మ దంపతులకు జన్మించిన  ఉపేందర్ గౌడ్ ప్రాధమిక విద్య 1 నుంచి 10వ తరగతి వరకు ఆలేరులోనే సాగింది. ఇంటర్ మీడియట్ కోసం భువనగిరికి వెళ్లాల్సి వచ్చింది. అటు తర్వాత సికింద్రాబాద్ లోని సర్ధార్ పటేల్ కాలేజ్ లో బీఎస్సీ చేశారు. ఏప్రిల్ 4, 1986 లో విజయకుమారితో వివాహం జరిగింది.  ప్రస్తుతం హైదరాబాద్ లోజి బోడుప్పల్ లో నివాసముంటున్న మొరిగాడి ఉపేందర్ గౌడ్ కు ప్రజా సమస్యలపై పోరాడడం బాగా తెలుసు. అలాంటి వ్యక్తికి నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులుగా పదవీ భాద్యతలు అప్పగించినదుకు  నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉడుతల బాలకృష్ణ గౌడ్ కు తెలంగాణ రాష్ట్ర గౌడ్సు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. న్యూ పంచ కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు సైతం మొరిగాడి ఉపేందర్ గౌడ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులుగా నియమితులైన మొరిగాడి ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ ఇంత ముఖ్యమైన పదవిలో నియమించినందుకు ముందుగా నూతన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉడుతల బాలకృష్ణ గౌడ్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ గౌడ సంఘం సమస్యలపై నిరంతరం స్పందించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే దిశగా ముందుంటానని తెలిపారు. ఐక్యమత్యంతో ఉంటే సాధించలేనివంటూ ఉండవని మొరిగాడి ఉపేందర్ గౌడ్ చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: