తునికి సీతయ్య ఫౌండేషన్ సేవలు మరువలేనివి

హీరో సాయికిరణ్ 

(జానోజాగో వెబ్ న్యూస్- ఆలేరు ప్రతినిధి)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తునికి సీతయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో సేవలందించిన వారికి జరిగిన సన్మాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెండితెర, బుల్లితెర నటుడు, యువకిశోరం సాయి కిరణ్, విశిష్ట అతిధిగా సినీ సంగీత దర్శకులు సాయి మధుకర్, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, గౌరవ అతిధిగా జయరాం బర్లపాటి, ఆత్మీయ అతిధిగా శేఖర్ వట్టికోటి, నంది అవార్డు గ్రహీత,   చీఫ్ సబ్ - ఎడిటర్ ఎం.డి. అబ్దుల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా  తునికి సీతయ్య ఫౌండేషన్  ఆధ్వర్యంలో కోవిడ్ లో సేవలందించిన వైద్యులు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులకు ఘన సత్కారం జరిగింది.  కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలను సైతం లెక్కజేయకుండా సేవలు అందించి ప్రతీ ఒక్కరూ దైవాలతో సమానమని ముఖ్య అతిధిగా హాజరైన హీరో సాయికుమార్ అన్నారు. ప్రపంచాన్ని కుదుపేసిన  భయంకరమైన కరోనాలో కూడా  వైద్యులు, పోలీసులు , పారిశుద్ధ్య కార్మికులు , జర్నలిస్టులు అసమానమైన సేవలను అందించి ప్రజలకు రక్షణ వలయాలుగా మారారని కొనియాడారు.
అలాంటి సేవలందించిన వారిని  సత్కరించుకోవడం బాధ్యతగా భావించి తునికి సీతయ్య ఫౌండేషన్  సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప ఔదార్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్న సూత్రానికి  ప్రత్యక్ష ఉదాహరణలుగా మారిన సేవామూర్తుల  సత్కార్యాన్ని నిర్వహించే అవకాశం తనకు కలగడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని సాయికిరణ్ పేర్కొన్నారు. సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ ప్రపంచ విపత్తుగా మారి శాసించిన  కరోనాను ఎదుర్కొని నిలిచేందుకు మనిషి వెనుక కవచాలుగా మారిన సేవామూర్తులను గుర్తించి సన్మానించడం మానవీయతకు నిదర్శనమని  సీతయ్య ఫౌండేషన్  నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్బంగా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును సాధించి  మూడుదశాబ్దాల పాటు జర్నలిజం రంగంలో  విశేష సేవలందిస్తూ ఆలేరుకు పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చిన ఎం.డి. అబ్దుల్ ను ఫౌండేషన్ పక్షాన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఇంకా  ఈ కార్యక్రమంలో కోవిడ్ సమయంలో విధులు నిర్వహించి తమ వంతు పాత్ర నిర్వహించిన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు, మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులకు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.  కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు, మున్సిపల్ శాఖ అధికార్ల, కార్మికులతోపాటు జర్నలిస్టుల సేవలు మరవలేనివి అని తునికి సీతయ్య ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తునికి సీతయ్య ఫౌండేషన్ అధ్యక్షులు తునికి దశరథ, గౌరవాధ్యక్షులు, తెలంగాణ వ్యయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తునికి విజయసాగర్, ట్రస్ట్ సభ్యులు తునికి భాస్కర్, తునికి రామారావు, తునికి చంద్రశేఖర్, తునికి గణేష్, తునికి రవికుమార్, తునికి హరి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త మాధవరెడ్డి, వెంకటేష్ యాదవ్ ఆరుట్ల తదితరులు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: