డ్రైవర్ల కడుపులు మాడ్చిన కరోనా 

 6 నెలలుగా అందని బాడుగలు

ఆర్ధిక ఇబ్బందుల్లో జీపు డ్రైవర్లు

ప్రాణాలకు తెగించి వాహనాలు నడిపితే వారికిచ్చే బహుమానం ఇదేనా 

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ( ఏ.ఐ.ఎఫ్.బి ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని రాజునాయుడు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కరోనా భాధితులను క్వారంటైన్ కు తరలించేందుకు ప్రభుత్వం ప్రైవేటు జీపులను వినియోగించుకుందని, కానీ ఆరు నెలలైనా జీపు డ్రైవర్లకు వారి బాడుగలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని రాజునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు స్ధానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కరోనా తీవ్రంగా ఉన్న రోజులలో రోగులను క్వారంటైన్ కు తరలించడానికి ప్రభుత్వ అంబులెన్సుల కొరత ఏర్పడటంతో, క్వారంటైన్ కన్వీనర్ల వినతి మేరకు నంద్యాల డివిజన్లో ప్రైవేట్ అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారనీ,  అయితే ప్రైవేట్ అంబులెన్సుల డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో ఆ సమయంలో నంద్యాల డివిజన్ లోని 50 మంది డ్రైవర్లు సామాజిక సేవా ధృక్పధంతో తమ జీపులను అంబులెన్సులుగా ఏర్పాటు చేసుకొని కరోనా భాధితులను క్వారంటైన్ కు తరలించే కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రాంతీయ రవాణా శాఖాధికారుల పర్యవేక్షణలో రోజుకు 1875-/ రూపాయలు అద్దె చొప్పున జీపులను ఏర్పాటు చేశారన్నారు.
జీపు డ్రైవర్లు ప్రాణాలకు తెగించి మూడు నెలల పాటు ఈ సేవలందించారనీ, అయితే వారికి చెల్లించాల్సిన అద్దెలను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదన్నారు. ఈ సమష్యపై డ్రైవర్లు జిల్లా కలెక్టర్ కు మూడు సార్లు విన్నవించినా సమష్య పరిష్కారం కాలేదన్నారు. జీపు అద్దెలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే వారికి చెల్లించాల్సిన బాడుగలు చెల్లించాలని లేకపోతే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: