మార్చి 5న..

రాజ్ త‌రుణ్ `పవర్ ప్లే'

(అవినాష్ పెద్దోజి - జానోజాగో వెబ్ న్యూస్)

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండ‌గా ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవేష్ మాట్లాడుతూ  -

  `` రాజ్ త‌రుణ్‌, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో డిఫ‌రెంట్ జోన‌ర్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది. మార్చి 5న వ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం.  ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ‌లో వరంగల్ శ్రీను 'కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్' ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. అలాగే  యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్, ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది`` అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - `` పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 5 న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతున్న `ప‌వ‌ర్‌ ప్లే`  త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది`` అన్నారు.  రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి


క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,

సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,

సంగీతం: సురేష్ బొబ్బిలి‌,

ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,

ఆర్ట్‌: శివ‌,

ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,

కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,

నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: