నామినేషన్ల స్వీకరణ 4వ తారీకు వరకు స్వీకరిస్తాం 

జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 2వ విడుత నామినేషన్ల స్వీకరణ 4వ తారీకు వరకు స్వీకరిస్తామని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిణి కల్పన కుమారి అన్నారు. నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిని కల్పనా కుమారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారంతో ముగిసిందన్నారు. నంద్యాల రెవెన్యూ డివిజన్లో తొలి విడతగా 10 మండలాలలోని 169 గ్రామ పంచాయతీలకు 1056 మంది సర్పంచులుగా నామినేషన్స్ దాఖలు చేశారని, 1672 వార్డులకు గాను 3777 మంది నామినేషన్ దాఖలు చేశారన్నారు.
సోమవారం జరిగిన స్కుటీనిలో 13 సర్పంచ్ కి సంబంధించిన నామినేషన్లు, 55 వార్డు మెంబర్లకు సంబంధించిన నామినేషన్లను రిజెక్ట్ చేశామని, రిజెక్ట్ అయిన నామినేషన్ల వారు మంగళవారం నుండి అప్పీల్ చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అవకాశం కల్పించిందన్నారు. అందులో భాగంగానే ఈరోజు తిరస్కరణకు గురి కాబడిన నామినేషన్లను సబ్ లెక్టర్ కార్యాలయంలో ఆపిల్ కు వచ్చి ఉన్నారని  వీటిని బుధవారం రోజు డిస్పోజల్ చేయడం జరుగుతుందన్నారు. రెండో విడత లో బనగానపల్లి,  కోవెలకుంట్ల, సంజామల, అవుకు,  కొలిమిగుండ్ల, పాణ్యం, గడివేముల ఈ ఏడు మండలాల్లో 137 గ్రామ సర్పంచులకు, 1378 వార్డు మెంబర్లకు మంగళవారం నుండి 48 క్లస్టర్ల ద్వారా నామినేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు.
1454 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశామని, రెండో విడతలో ఈ నెల 4వ తారీకు వరకు నామినేషన్ల స్వీకరణ, 5వ తారీఖు స్కునిటీ ఆరో తారీకు తిరస్కరించిన నామినేషన్లు తిరిగి అప్లై చేసుకునే అవకాశం 7 వతారీకు అభ్యంతరాల పరిశీలన 8వ తారీఖు ఉపసంహరణ మరియు తుది జాబితా విడుదల 13వ తారీఖున పోలింగ్ అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఉన్నతాధికారులు నామినేషన్ ప్రక్రియను పోలింగ్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీలు గావించు తారని, కావున ఎన్నికలలో విధులు నిర్వహించే సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని ఆమె ఎన్నికల సిబ్బందికి సూచించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: