మరో 2 రోజులు పాటు...

కోస్తా..సీమలో తేలికపాటి వర్షాలు

(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

 తమిళనాడు నుంచి ఉత్తరకోస్తా వరకు తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి విస్తరించింది. ఇంకా ఈశాన్య భారతం నుంచి మధ్య భారతం, తెలంగాణ, కర్నాటక మీదుగా అరేబియా సముద్రం వరకు మరో ద్రోణి ఆవరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతోపాటు సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల దట్టంగా మేఘాలు ఆవరించాయి. పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాల్లోనూ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుంటే ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో రాష్ర్టంలో చలి‌గా‌లులు వీస్తు‌న్నాయి.  తెల్ల‌వా‌రు‌జా‌మున చలి తీవ్రత ఎక్కు‌వగా ఉంటోంది.  ఉదయం అక్క‌డ‌క్కడ తేలి‌క‌పాటి పొగ‌మంచు ఏర్పడే అవ‌కాశం ఉన్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.  శని‌వారం ఈశాన్య బీహార్‌ నుంచి ఆగ్నేయ అరే‌బి‌యన్‌ సముద్రం వరకు విస్త‌రించి ఉన్న పశ్చిమ గాలు‌లతో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ద్రోణి.. ఆది‌వారం నాగా‌లాండ్‌ నుంచి ఛత్తీ‌స్‌‌గఢ్‌, తెలం‌గాణ, దక్షిణ కర్ణా‌టక తీరం మీదుగా లక్ష ద్వీప్‌ ప్రాంతం వరకు విస్త‌రించి ఉందని పేర్కొ‌న్నది. రాష్ర్టంలో కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా సిర్పూ‌ర్‌(యు) అత్య‌ల్పంగా 13.3 డిగ్రీలు, భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గం‌ప‌హ‌డ్‌లో అత్య‌ధి‌కంగా 35.8 డిగ్రీల ఉష్ణో‌గ్ర‌తలు నమో‌ద‌య్యాయి.  జీహె‌చ్‌‌ఎంసీ పరి‌ధిలో బండ్ల‌గూ‌డలో అత్య‌ల్పంగా 16.6 డిగ్రీలు, బీహె‌చ్‌‌ఈ‌ఎ‌ల్‌లో అత్య‌ధి‌కంగా 30.4 డిగ్రీల ఉష్ణో‌గ్ర‌తలు రికా‌ర్డ‌య్యాయి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి  

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: