కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా...

ఈనెల 28న "వైష్ణవ జనుడవు నీవే అయితే"

జాతిపిత మహాత్మాగాంధీ..ప్రార్థనాగీతం ఆవిష్కరణ సభ!!

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

     మహాత్మాగాంధీ తన దినచర్యలో భాగంగా ఓ ప్రార్ధనాగీతం ఆలపించేవారు. 14 వ శతాబ్దంలో.. నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాసిన గీతమిది. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది. ఈ గీతాన్ని తెలుగులో రాసి విడుదల చేస్తున్నారు శ్రీ వెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ కమలా రామన్.

     'ఆనంద్, గోదావరి, చందమామ' వంటి సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్ స్వర సారధ్యం వహించిన ఈ ప్రార్ధనాగీతానికి... ప్రముఖ గాయనీమణి ఉషతో కలిసి సుప్రసిద్ధ గాయకులు ఉన్నికృష్ణన్ గాత్రమందించారు.

     ఈ గీతాన్ని ఈనెల 28, ఆదివారం సాయంత్రం 6 గంటలకు.. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నిర్వహించేందుకు గీత రచయిత్రి-శ్రీవెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీమతి కమలారామాన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలకాలంలో కొరవడిపోతున్న దేశభక్తిని ప్రజల్లో పెంపొందించాలనే సత్సంకల్పంతో "వైష్ణవ జనుడవు నీవే అయితే" గీత రూపకల్పనకు నడుం కట్టామని డాక్టర్ కమల పేర్కొన్నారు.

     కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో.. ఎమ్.ఎల్.సి. రామచంద్రరావు, ప్రముఖ నటులు, మాజీ మంత్రి బాబుమోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటులు అలీ, బ్రిగేడియర్ వి.శ్రీనివాసరావు విశిష్ట అతిధులుగా పాల్గొంటున్నారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: