ఈనెల 27న డాక్టర్ ఏలూరికి...

ది టైమ్స్ గ్రూప్ '40 అండర్ 40 అవార్డ్స్' ప్రధానం



(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఫార్మా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి.. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న హైదరాబాద్ కు చెందిన ఎస్సార్సి లాబొరేటరీస్ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.. తాజాగా మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక ది టైమ్స్ గ్రూప్ తరఫున ఎకనామిక్ టైమ్స్ సంస్థ అందించే '40 అండర్ 40 అవార్డ్స్' జాబితాలో చోటుసంపాదించారు. ఈ అవార్డుకు సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు 40 మందిని ఎంపిక చేసింది ఎకనామిక్ టైమ్స్.. ఇందులో భాగంగా  సౌత్ ఇండియాలో హెల్త్ కేర్ రంగానికి గాను డాక్టర్ ఏలూరి పేరును చేర్చింది. ఈ విషయాన్ని ది టైమ్స్ గ్రూప్ రీజనల్ హెడ్ మమతా నల్లారెడ్డి  మీడియాకు వెల్లడించారు.. గత దశాబ్ద కాలంగా ఫార్మారంగంలో డాక్టర్ ఏలూరి చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు వరించిందని చెప్పారు. ఈనెల 27న బెంగుళూరులోని The Ritz-Carlton ఫైవ్ స్టార్ హోటల్ లో  అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది. 

ఇక టైమ్స్ గ్రూప్ తరఫున '40 అండర్ 40 అవార్డ్స్' జాబితాలో చోటు సంపాదించడం పట్ల డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సార్సి లాబొరేటరీస్ ఉద్యోగుల శ్రమ, ప్రజల ఆశీర్వాదంతోనే ఈ ఘనత సాధించామని చెప్పారు. భవిశ్యత్ లో కూడా ఇలాంటి విజయాలెన్నో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ లక్ష్యం ఇండియాలో క్యాన్సర్ మహమ్మారిని లేకుండా చేయడమే అన్నారు.. ఆ దిశగానే తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కాగా ఇండియాలో క్యాన్సర్ మహమ్మారిని రూపుమాపడానికి గత 10 ఏళ్లుగా తీవ్ర కృషి చేస్తోంది ఎస్సార్సి లాబొరేటరీస్. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ డ్రగ్స్ పై పరిశోధనలు జరుపుతోంది. దాంతో ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా డాక్టర్ ఏలూరి చేస్తోన్న కృషిని గుర్తించిన కొలంబియా యూనివర్సిటీ ఆయనకు 'పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్' ప్రధానం చేసింది.. తాజాగా '40 అండర్ 40 అవార్డ్స్' జాబితాలో చేరడం విశేషం.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: